Last Updated:

Mexico: మెక్సికో లో ఓటిస్ హరికేన్ బీభత్సం.. 27 మంది మృతి

మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.

Mexico: మెక్సికో లో  ఓటిస్ హరికేన్ బీభత్సం.. 27 మంది మృతి

Mexico: మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.

అత్యంత శక్తివంతమైన తుఫాను..(Mexico)

దాదాపు 900,000 మంది జనాభా ఉన్న అకాపుల్కోనగరం  శిధిలాలు,మునిగిపోయిన వీధులు మరియు కార్లతో దర్శనమిస్తోంది. వరదలతో కొన్ని ఆసుపత్రులు రోగులను ఖాళీ చేయవలసి వచ్చింది.మరణించిన వారిలో చాలా మంది పొంగిపొర్లుతున్న నదులలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. .ప్రపంచ వాతావరణ సంస్థ హరికేన్‌ను అత్యంత వేగవంతమైన ఉష్ణమండల తుఫానులలో ఒకటి”గా అభివర్ణించింది. పర్యాటకులు మెక్సికో నగరానికి చేరుకోవడానికి వీలుగా ఎయిర్ బ్రిడ్జ్ శుక్రవారం నుండి పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది. మెక్సికో పసిఫిక్ తీరాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఓటిస్ అని మెక్సికన్ అధికారులు తెలిపారు.

మెక్సికో సైన్యం, వైమానిక దళం మరియు జాతీయ గార్డుకు చెందిన దాదాపు 8,400 మంది సభ్యులను అకాపుల్కో మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలకు నియమించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.అకాపుల్కో అనేది దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో అతిపెద్ద నగరం. స్థానిక ఆర్థిక వ్యవస్థ పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఓటిస్ నగరం యొక్క తీరంలో ఉన్న కొన్ని ప్రసిద్ధ హోటళ్లకు అపారమైన నష్టాన్ని కలిగించింది. గెరెరో గవర్నర్ ఎవెలిన్ సల్గాడో నగరంలోని 80 శాతం హోటళ్లు తుఫానుతో దెబ్బతిన్నాయని, విద్యుత్తును పునరుద్ధరించడానికి మరియు తాగునీటి పంపులను బాగుచేయడానికి అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు.