Home / reservoirs
గత కొద్దికాలంగా సంభవించిన వరుత తుపాన్లతో కాలిఫోర్నియాలోని 17 ప్రధాన రిజర్వాయర్లలో 12 వాటి చారిత్రక సగటు కంటే ఎక్కువగా నిండి ఉన్నాయి. తుఫానులకు ముందు, కాలిఫోర్నియా కరువు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కీలకమైన రిజర్వాయర్లలో నీటి స్థాయిలు చాలా తక్కువగా పడిపోయాయి.
ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్రలను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది.