Last Updated:

America: అమెరికా మిచిగాన్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు..

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

America: అమెరికా మిచిగాన్ యూనివర్శిటీలో  కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు..

America:  అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు.

మిచిగాన్ యూనివర్శిటీలో రెండు భవనాల వద్ద కాల్పులు..(America)

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు యూనివర్సిటీలోకి చొరబడ్డాడు. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించారు. మరో పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అమెరికాలోని అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్‌ లాన్సింగ్‌ క్యాంపస్‌లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు. కాగా పోలీసులు క్యాంపస్‌ అణువణువు గాలిస్తున్నారు.

నిందితుడికోసం పోలీసుల గాలింపు..(America)

అయితే దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత తక్షణమే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇంటిరియం డిప్యూటీ చీఫ్‌— యూనివర్శిటీ పోలీసు క్రిస్‌ రోజ్‌మాన్‌ దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అందించారు. రెండు లోకేషన్లలో దుండగుడు కాల్పులు జరిపాడని తెలిపారు. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి కాల్పులు జరిపాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రెండు ప్రాంతాల్లో బాధితులను గుర్తించామని రోజ్‌మాన్‌ తెలిపారు. ఐదుగురిని ఆస్పత్రికి తరలించగా వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, కనీసం ముగ్గురు మృతి చెందారని పోలీసు చీఫ్‌ పేర్కొన్నారు.మొదటిసారి కాల్పులు శబ్దం విన్న తర్వాత క్యాంపస్‌లోని భవనాలను మూసివేయడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల కోసం అన్వేషించడం మొదలైందని చెప్పారు. అలాగే అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో పాటు క్యాంపస్‌ చుట్టు పక్కల ఉన్న రెసిడెంట్స్‌ మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను కోరుతున్నారు. కాగా నిందిడుతు కోసం పెద్ద ఎత్తున గాలింపు మొదలుపెట్టారు.

14 నెలల తరువాత ఈ ప్రాంతంలో కాల్పుల కలకలం..

అనుమానిత దుండగుడి గురించి పోలీసు అధికారులు వివరిస్తూ దుండగుడు పొట్టిగా మాస్క్‌ ధరించి ఉన్నాడని చెప్పారు. చివరగా అతడు ఎంఎస్‌యు యూనియన్‌ బిల్డింగ్‌ వద్ద పరుగెడుతున్నట్లు గమనించారని రొజ్‌మాన్‌ చెప్పారు. కాగా సోమవారం నాటి హింస విషయానికి వస్తే 14 నెలల తర్వాత మరోసారి ఇక్కడ హింస చెలరేగింది. చివరగా నవంబర్‌ 30, 2021లో ఆక్స్‌ఫోర్డ్‌ హైస్కూలు, ఓక్‌ల్యాండ్‌ కంట్రీ, మిచిగన్‌లో జరిగింది. ఈస్ట్‌ లాన్సింగ్‌కు 80 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అప్పుడు 15 ఏళ్ల విద్యార్థి సెమి ఆటోమెటిక్‌ పిస్తోల్‌తో కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో విద్యార్థి నలుగురు క్లాస్‌మేట్స్‌ చనిపోయారు. మరో ఆరుగురు విద్యార్థులు, టీచర్‌ గాయపడ్డారు. అమెరికాలో అత్యంత దారుణమైన కాల్పులు జరిగింది మాత్రం 2021లోనే. అయితే ఈ టీనేజ్‌ కర్రాడు మాత్రం తాను అమాయకుడినని పోలీసుల ముందు వేడుకుంటున్నాడు. తన తల్లిదండ్రులు క్రిస్మస్‌ సందర్భంగా తనకు ఆటోమెటిక్‌ పిస్తోల్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పాడు. కాగా పోలీసులు తల్లిదండ్రులను మర్డర్‌ కేసు కింద అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి: