Last Updated:

Shoji Morimoto: ఏమీ చెయ్యకపోడమే అతను చేసే పని.. సంపాదన..!

కూటి కోసం కోటి విద్యలంటారు పెద్దలు. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక పనిచేస్తూ జీవించాలి. బ్రతుకుబండి లాగాలంటే ఏదోఒక ప‌ని చెయ్యక తప్పదు. ఆస్తిపాస్తులు ఉన్న వారు తప్ప ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు తమ రెక్క‌ల క‌ష్టంతోనే బ‌త‌కాల్సిన ప‌రిస్థితి.

Shoji Morimoto: ఏమీ చెయ్యకపోడమే అతను చేసే పని.. సంపాదన..!

Japan: కూటి కోసం కోటి విద్యలంటారు పెద్దలు. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక పనిచేస్తూ జీవించాలి. బ్రతుకుబండి లాగాలంటే ఏదోఒక ప‌ని చెయ్యక తప్పదు. ఆస్తిపాస్తులు ఉన్న వారు తప్ప ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు తమ రెక్క‌ల క‌ష్టంతోనే బ‌త‌కాల్సిన ప‌రిస్థితి. అయితే అందుకు భిన్నంగా అసలు ఏ పని చెయ్యకుండా కూడా డబ్బు సంపాధించవచ్చని నిరూపిస్తున్నాడు జపాన్ రాజధాని అయిన టోక్యో నగరానికి చెందిన ఓ వ్యక్తి. మరి అతను ఎవరు? ఏమి చెయ్యకుండా డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివెయ్యాల్సిందే.

అతిథులకు తోడుగా.. గంటకు రూ.5వేలు

టోక్యోకు చెందిన షోజి మోరిమోటో అస‌లు ఏమీ చేయ‌కుండానే అల‌వోక‌గా డబ్బు సంపాదిస్తున్నాడు. అదెలా అనుకుంటున్నారా, తాను ఏమీ ప‌నిచేయ‌కుండా ఉన్నందుకే త‌న‌కు డ‌బ్బులు చెల్లిస్తున్నారని షోజీ మోరిమోటో (38) చెబుతున్నాడు. అతిథుల‌కు తోడుగా వెళ్లడమే తాను చేసే పని అని అలా వెళ్లినప్పుడు క్లయింట్ల నుంచి ఒక్కో బుకింగ్ 10,000 యెన్‌లు అనగా మన కరెన్సీలో అక్షరాల రూ. 5663 వ‌సూలు చేస్తానని అతడు వివరించాడు.

ట్విట్టర్ ద్వారా క్లయింట్లు..

ఈ విధంగానే గ‌త నాలుగేండ్లుగా మోరిమోటో ఏకంగా 4000కు పైగా అతిథులకు తోడు వెళ్లే సెష‌న్స్‌లో పాలుపంచుకున్నాడు. అతిథుల వెంట వెళ్లేందుకు తాను రెంట్‌కు సిద్ధంగా ఉన్నాన‌ని, తాను వారి వెంట ఉండ‌ట‌మే త‌ప్ప ప్ర‌త్యేకంగా ఏ ప‌ని అంటూ చేయ‌న‌ని మోరిమోటో చెప్పుకొచ్చాడు. ఎక్కువ‌మంది క్లైంట్లు త‌న‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా సంప్ర‌దిస్తార‌ని వెల్లడించారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌పై 2.5 ల‌క్ష‌ల పాలోయ‌ర్ల‌ను తాను క‌లిగి ఉన్నానని తెలిపారు.

ఏమీ చెయ్యకపోడం కూడా ఓ పనే..

అతిథులను ఎంపిక చేసుకోవ‌డంలో మోరిమోటో కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. వ‌స్తువుల‌ను త‌ర‌లించ‌డం, లైంగిక అవ‌స‌రాలు తీర్చ‌డం వంటి ప‌నుల‌ు తాను చెయ్యనని చెప్పాడు. ఈ జాబ్‌కు ముందు మోరిమోటో ఓ ప‌బ్లిషింగ్ కంపెనీలో ప‌నిచేశాడు. కాగా అక్కడ ఏమీ చేయకపోవడం తనిని ఉద్యోగం నుంచి తొలగించారని అతను తెలిపారు. ఏమీ చేయకపోవడం మంచిదేన‌ని, ప్రజలు నిర్దిష్ట ప‌ద్ధ‌తిలో ఉపయోగకరంగా ఉండవలసిన అవసరం లేదు” అని అంటాడు మోరిమోటో.

ఇవి కూడా చదవండి: