Home / అంతర్జాతీయం
ఆఫ్రికా దేశాలు కరువుతో విలవిల్లాడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు యూరప్కూడా ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని విల్లవిల్లాడిపోతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా యూరప్‌ను ఈ ఏడాది కరువు వెంటాడుతోంది.
అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై టెర్రరిజం చార్జీ ఫైల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అంటార్కిటికా శీతాకాలం ముగిసింది 4 నెలల చీకటి తర్వాత మొదటి సూర్యోదయాన్ని చూసినట్టు అక్కడి కాంకోర్డియా పరిశోధనా కేంద్రంలోని 12 మంది సభ్యుల బృందం తెలిపింది.
పాకిస్తాన్లో వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలంటే చక్కటి ఆయుధం బ్లాస్‌పేమి లేదా దైవ దూషణ. అల్లాను నిందిచాడని లేదా ఖురాన్‌ను అగౌరవ పరచాడంటూ నేరం మోపి చంపేసిన ఘటనలు పాక్‌లో కొకొల్లలు. అలాగే జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య లెక్కేలేదు.
ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్
పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా, అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు రష్యా
లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్‌గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు.