Last Updated:

Indian CEOs: ప్రపంచంలో… భారతీయుల కీర్తి నజరానా….

భారతీయుల మేధస్సుకు ప్రపంచం సలాం కొడుతుంది....ఉన్నత స్ధాయి కంపెనీల్లో కీలక పదవులను పొందుతూ దేశ ప్రాముఖ్యతను మరింతగా ఇనుమడింపచేస్తున్నారు. విశ్వ వాణిజ్య శ్రేణిలో పలు రంగాల్లో దిగ్గజ కంపెనీల ప్రతినిధులుగా భారతీయులు రాణిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ఇట్టే కౌవశం చేసుకొంటున్నారు.

Indian CEOs: ప్రపంచంలో… భారతీయుల కీర్తి నజరానా….

Indian CEOs: భారతీయుల మేధస్సుకు ప్రపంచం సలాం కొడుతుంది….ఉన్నత స్ధాయి కంపెనీల్లో కీలక పదవులను పొందుతూ దేశ ప్రాముఖ్యతను మరింతగా ఇనుమడింపచేస్తున్నారు. విశ్వ వాణిజ్య శ్రేణిలో పలు రంగాల్లో దిగ్గజ కంపెనీల ప్రతినిధులుగా భారతీయులు రాణిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ఇట్టే కౌవశం చేసుకొంటున్నారు. ప్రపంచంలోనే అతి కీలక వ్యాపార సామ్రాజ్యంతో కీర్తిని గడిస్తున్న కంపెనీల్లో ముఖ్య భూమికగా వ్యవహరిస్తున్న వ్యక్తుల్లో తాజాగా లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ సిఇవోగా నియమితులైన నేపధ్యంలో భారతీయల ప్రతిభను అనంత విశ్వానికి తెలియచేసిన వారిపై ఓ చిన్నపాటి కధనం….

లక్ష్మణ్ నరసింహన్

నరసింహన్ ఈ ఏడాదిలో స్టార్ బక్స్ లో చేరుతారు…అనంతరం 2023 ఆర్ధిక సంవత్సరంలో సిఇవో పదవిలో కొనసాగనున్నారు. నరసింహన్ 2019 లో రెకిట్‌ బెంకీజర్ కంపెనీలో మొదటి విదేశస్ధుడిగా ఆ సిఇవో గా పనిచేసారు. గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు.

సుందర్ పిచాయ్
జూన్ 10, 1972న చెన్నైలో జన్మించిన పిచాయ్ IIT-ఖరగ్‌పూర్ లో గ్రాడ్యుయేట్ చేసి 2015లో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ స్థానంలో గూగుల్ సిఇవో గా ఎన్నికైనారు. 2020లో గూగుల్ మాతృ సంస్ధ ఆల్ఫాబెట్ లో సిఇవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ క్రోం ఓఎస్ లను అభివృద్దితోపాటు పలు కీలక సాంకేతిక వ్యవస్ధలకు పిచ్చాయ్ నాయకత్వం వహించారు. గూగుల్ డ్రైవ్ తయారీ లో కూడా సుందర్ పిచ్చాయ్ పాత్ర ప్రాధమికంగా ఉండడం గమనార్హం.

పరాగ్ అగర్వాల్
ఐఐటి బాంబే, స్టాన్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థిగా గుర్తింపు పొందిన పరాగ్ అగర్వాల్ 2021 నుండి ట్విట్టర్ సిఇవో గా కొనసాగుతున్నారు. అంతకుముందు పరాగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా అదే కంపెనీలో పనిచేస్తూ సిఇవో గా ఎదిగారు.

సత్య నాదెళ్ల
నాడు ఆ కంపెనీలో యువ ఇంజనీర్ అంచలంచల పనితనం అదే కంపెనీకి ఆయనను సిఇవో గా పదోన్నతి పొందారు…ఆయనే సత్య నాదెళ్ల….1992లో మైక్రోస్టాఫ్ లో యువ ఇంజనీర్ గా చేరి 2014లో సిఇవో గా బాధ్యతలు చేపట్టారు. నేడు కంప్యూటర్ వ్యవస్ధలో కీలకమైన సాంకేతికతగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్స్ బాక్స్, అజూర్ క్లౌడ్ ప్లట్ ఫారంల వర్షన్ లకు సత్య నాదెళ్ల నాయకత్వం వహించివున్నారు.

శాంతను నారాయణ్, అడోబ్ ఇంక్
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువు చదివి 2007 నుండి అడోబ్ ఇంక్ సిఇవో, చైర్మన్, ప్రెసిడెంట్ కీలక పదివిలో కొనసాగుతూ శాంతను నారాయణ దేశానికి, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పేరును సంపాదించిపెట్టారు. చాఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుభవం కూడా కల్గిన నారాయణ్ యాపిల్ సంస్ధలో కూడా పనిచేసివున్నారు.

అరవింద్ కృష్ణ, IBM
టెక్ దిగ్గజం ఐబిఎం కంపెనీ సిఇవో గా 2020లో ఎన్నికై ఐఐటి కాన్పూర్ చదువుకు కేరాఫ్ అంటూ నిరూపించారు అరవింద్ కృష్ణ…1990లో ఐబిఎం లో చేరిన కృష్ణ రీసెర్చ్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఐబిఎం చరిత్రలో అతి పెద్ద కొనుగోలుగా దేశంలో ప్రశంసలు అందుకొన్న వ్యవహరంలో రెడ్ హాట్ కంపెనీ ఒప్పందం కూడా కృష్ణ సమక్షంలో జరగడం ఆయన మేధస్సుకు దర్పణం…

రాజ్ సుబ్రమణ్యం, ఫెడెక్స్
తమిళనాడు తిరువనంతపురం కుర్రాడు 30 సంవత్సరాల క్రితం ఫెడ్ ఎక్స్ అనే కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అదే కంపెనీకి 2022లో సిఇవో గా ఎన్నికై దక్షిణ భారత దేశంలో ప్రశంసలు అందుకొని రాజ్ సుబ్రమణ్యం ప్రత్యేకంగా నిలిచారు. ఐఐటి బాంబే విద్యార్ధి అయిన సుబ్రమణ్యం కంపెనీలో పలు కీలక వ్యవస్ధల్లో తన సేవలను అందించివున్నారు.

లీనా నాయర్, చానెల్
ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఛానల్ సిఇవోగా 2021లో లీనా నాయర్ బాధ్యతలు చేపట్టి మొట్ట మొదటి మహిళ నేనంటూ భారత దేశ కీర్తిని విశ్వంలో నిలిపారు. మహారాష్ట్రకు చెందిన లీనా నాయర్ యూనీలీవర్ లండన్ లో మానవ వనరుల అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం కూడా పొందివున్నారు.

CS వెంకటకృష్ణన్, బార్క్లేస్
బ్యాంకింగ్ రంగంలో పేరొందిన బర్ క్లేస్ కు 2021 నుండి సిఎస్ వెంకటకృష్ణన్ సిఇవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన జెపి మోర్గాన్ చేజ్ అనే కంపెనీలో 20 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగివున్నాడు…

ఇవి కూడా చదవండి: