Home / అంతర్జాతీయం
కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు చైనా మరోసారి లాక్ డౌన్ విధించింది. దేశంలోనిఏడు ప్రావిన్షియల్ రాజధానులతో సహా 33 నగరాలు 65 మిలియన్లకు పైగా ప్రజలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తారు. జాతీయ సెలవుల్లో దేశీయ ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.
చంద్రుడికి పైకి నాసా ప్రయోగించ తలపెట్టిన మానవ రహిత ఆర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగం మరోమారు వాయిదా పడింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉపగ్రహ వాహక నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ లో ఇంధనం నింపుతుండగా లీక్ సమస్య ఎదురైంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం సొంత గడ్డ పై కాలు మోపారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయకు బంగళా, 24 గంటలపాటు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం
యుఎస్‌లోని నార్త్ కరోలినాలో నివసిస్తున్న ప్యాటీ హెర్నాండెజ్ మరియు ఆమె భర్త కార్లోస్, తండ్రిని గౌరవించడం కోసం తన పిల్లలందరికీ 'సి'తో మొదలయ్యే పేర్లను ఎంచుకున్నారు. ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు మరియు పది మంది అమ్మాయిలు ఉన్నారు.
స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు శ్రీలంక ప్రభుత్వానికి లేఖరాసారు. తాను స్దాపించిన కైలాస దేశంలో వైద్యసదుపాయాలు లేవని తనకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నందున శ్రీలంకలో వైద్యచికిత్సకు అనుమతించాలంటూ లేఖలో పేర్కొన్నారు.
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా కు సమ్మె సెగ తగిలింది. వేతనాలు పెంపు, సెలవుల విధానం కోరుతూ సంస్థకు చెందిన పైలట్లు ఈ రోజు నుంచి సమ్మెకు దిగడంతో లుఫ్తాన్సా 800 విమానాలు రద్దు చేసింది.
ఆఫ్గనిస్తాన్ హెరాత్‌లోని గుజార్గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు
ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.