Home / అంతర్జాతీయం
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నీటి భాగస్వామ్యం, రైల్వేలు, సైన్స్, వాణిజ్యం మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యల పై ఏడు అవగాహన ఒప్పందాల (ఎంఒయులు) పై సంతకం చేశాయి.
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న కాన్వాయ్‌లోని వాహనం
ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. దగ్గు, తుమ్ములతో వచ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ క్వీన్ ఎలిజబెత్ IIకి అధికారికంగా తన రాజీనామాను అందించడానికి స్కాట్లాండ్కు వెళ్లే ముందు మంగళవారం తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుండి బయలుదేరారు.
ఇన్ స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫారమ్ నుండి పోర్న్‌హబ్ ఖాతాను తొలగించింది.ఇన్ స్టాగ్రామ్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్‌ను ఎప్పుడు తీసివేసింది అనేది అస్పష్టంగా ఉంది, అయితే జస్టిస్ డిఫెన్స్ ఫండ్ వ్యవస్థాపకులు మరియు సీఈవో లైలా మికెల్‌వైట్, ఖాతా "ఇప్పుడే తీసివేయబడింది" అని ట్వీట్ చేశారు.
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సుమారు ఏడుగురు మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు.సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.
కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు చైనా మరోసారి లాక్ డౌన్ విధించింది. దేశంలోనిఏడు ప్రావిన్షియల్ రాజధానులతో సహా 33 నగరాలు 65 మిలియన్లకు పైగా ప్రజలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తారు. జాతీయ సెలవుల్లో దేశీయ ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.
చంద్రుడికి పైకి నాసా ప్రయోగించ తలపెట్టిన మానవ రహిత ఆర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగం మరోమారు వాయిదా పడింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉపగ్రహ వాహక నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ లో ఇంధనం నింపుతుండగా లీక్ సమస్య ఎదురైంది.