Last Updated:

Blasphemy Law: పాకిస్తాన్‌లో దుర్వినియోగం అవుతున్న బ్లాస్‌పేమి చట్టం

పాకిస్తాన్‌లో వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలంటే చక్కటి ఆయుధం బ్లాస్‌పేమి లేదా దైవ దూషణ. అల్లాను నిందిచాడని లేదా ఖురాన్‌ను అగౌరవ పరచాడంటూ నేరం మోపి చంపేసిన ఘటనలు పాక్‌లో కొకొల్లలు. అలాగే జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య లెక్కేలేదు.

Blasphemy Law: పాకిస్తాన్‌లో దుర్వినియోగం అవుతున్న బ్లాస్‌పేమి చట్టం

Pakistan: పాకిస్తాన్‌లో వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలంటే చక్కటి ఆయుధం బ్లాస్‌పేమి లేదా దైవ దూషణ. అల్లాను నిందిచాడని లేదా ఖురాన్‌ను అగౌరవ పరచాడంటూ నేరం మోపి చంపేసిన ఘటనలు పాక్‌లో కొకొల్లలు. అలాగే జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య లెక్కేలేదు. సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నా వారికి బెయిల్‌ ఇప్పించడానికి లాయర్లు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే వారికి బెయిల్‌ ఇప్పిస్తే మత చాందసవాదులకు తాము టార్గెట్‌ అవుతామన్న భయంతో లాయర్లు కూడా దూరంగా ఉంటున్నారు.

ఇక తాజా బ్లాస్‌పేమి కేసు విషయానికి వస్తే పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఓ హిందూ సాటినేషన్‌ వర్కర్‌పై బ్లాక్‌పేమి కేసు నమోదు చేశారు. ఖురాన్‌ను అశోక్‌ కుమార్‌ అనే సానిటేషన్‌ వర్కర్‌ అపవిత్రం చేశాడని స్థానిక వ్యాపారి ఆరోపించాడు. వాస్తవానికి అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన స్థానిక వ్యాపారికి మధ్య మాటా మాటా పెరిగింది. బ్లాస్‌పేమి చట్టాన్ని అవకాశంగా తీసుకొని సదరు వ్యాపారి అశోక్‌కుమార్‌పై ఖురాన్‌ను అపవిత్రం చేశాడని ఆరోపించాడు. మైనారిటి హిందువు అశోక్‌కుమార్‌ ఒక అపార్టుమెంట బిల్డింగ్‌ వద్ద ఉండగా వ్యాపారి గుంపును పోగు చేసి దాడిచేయడానికి ప్రయత్నించాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన గుంపును చెదరగొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. అశోక్‌కుమార్‌ను తమకు అప్పగించాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. అతి కష్టం మీద పోలీసులు అశోక్‌కుమార్‌ ను రక్షించి తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ప్రస్తుతం అశోక్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని రాబియా సెంటర్‌లో గట్టి బందోబస్తు మధ్య ఉంచారు. ఖురాన్‌ను అపవిత్రం చేశాడని కుమార్‌పై 195 బీ సెక్షన్‌ కింది కేసు నమోదు చేశారు. వాస్తవానికి బిలాల్‌ అబ్బాసీ అనే దుకాణదారుడికి అశోక్‌కుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని పాకిస్తాన్‌ జర్నలిస్టు, కాలమిస్టు నాలియా ఇనాయత్‌ ట్వీట్‌ చేశారు. కాగా బిలాల్‌ పెద్ద ఎత్తున జనాలను పోగు చేసి కుమార్‌పై దాడికి యత్నంచగా, సమయానికి పోలీసులు వచ్చి గుంపును చెదరగొట్టారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ముస్లింల పవిత్ర గ్రంధాన్ని ఒక ముస్లిం మహిళ కాల్చి వేశారని స్థానిక మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కాగా సోషల్‌ మీడియాలో హైదరాబాద్‌ పోలీసులను ప్రశంలతో ముంచెత్తుతున్నారు. సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓ అమాయకుడి ప్రాణాన్ని కాపాడారని ప్రశంసించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మతోన్మాదాన్ని సహించేదిలేదని పలువురు తమ తమ ట్విటర్‌ ఖాతాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

అత్యంత క్రూరమైన బ్లాస్‌పేమి చట్టాన్ని ఎక్కువగా మైనారిటీలపై తమ వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి వినియోగించుకుంటున్నారు పాకిస్తాన్‌లో మైనారిటీలే కాదు ముస్లింలు కూడా వ్యక్తిగత గత కక్ష తీర్చుకోవడానికి బ్లాస్‌పేమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం బ్లాస్‌పేమి చట్టం దుర్వినియోగం పాకిస్తాన్‌లో విపరీతంగా పెరిగిపోతోందని పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో శ్రీ లంక ఫ్యాక్టరీ మేనేజర్‌ ప్రియాంతాను ప్యాక్టరీ కార్మికులు కొట్టి చంపి పెట్రోల్‌ పోసి కాల్చి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కూడా పాకిస్తాన్‌ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌లో సైనిక నియంత జియా ఉల్‌ హక్‌ పాలనలో బ్లాస్‌పెమి చట్టాన్ని తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చట్టానికి ఎంతో మంది అమాయకులు బలయ్యారు. వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. పాక్‌లోని షెహబాజ్‌ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే మత చాందస వాదుల నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనతో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు కూడా వాటి జోలికి పోవడంలేదు. ఇక పాకిస్తాన్‌లోని మైనారిటీలను ఆ అల్లానే కాపాడాలి.

ఇవి కూడా చదవండి: