Last Updated:

Suicide Attempt: 55 బ్యాటరీలు మింగిన వృద్ధురాలు… సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు… ఎందుకో తెలుసా..?

ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్‌ దేశంలో చోటుచేసుకుంది.

Suicide Attempt: 55 బ్యాటరీలు మింగిన వృద్ధురాలు… సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు… ఎందుకో తెలుసా..?

Suicide Attempt: ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్‌ దేశంలో చోటుచేసుకుంది.

ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ సమీప ప్రాంతంలో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధురాలు ఏమైందో ఏమో కానీ వివిధ సైజుల్లో ఉన్న సుమారు 55 బ్యాటరీలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అవి ఆమె కడుపు, పేగుల్లో చిక్కుకున్నాయి. కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆమెను స్థానికులు డబ్లిన్‌లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్‌ రే తీయగా ఆమె పొత్తి కడుపు పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలను గుర్తించారు. అయితే అదృష్టవశాత్తు ఆ బ్యాటరీల వల్ల ఆమె జీర్ణకోశం ఏమీ దెబ్బతినలేదని వైద్యులు వెల్లడించారు. పొత్తు కడుపు వద్ద సర్జరీ చేసిన వైద్యులు ఈ బ్యాటరీలు తొలగించారు.

ఇంత పెద్ద సంఖ్యలో బ్యాటరీలను సర్జరీ ద్వారా తొలగించడం ఇదే మొదటిసారి అని డాక్టర్లు వివరించారు. కాగా దీనికి సంబంధించి
ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ఈ వార్త ప్రచురించినట్లు సైన్స్‌ అలెర్ట్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: Crime News: అయ్యో చిట్టి తల్లి… కూల్ డ్రింక్ అనుకుని పురుగుల ముందు తాగి..!

ఇవి కూడా చదవండి: