Last Updated:

సీఐఏ బిల్ బర్న్స్: మోదీ ఆపాడు కాబట్టే పుతిన్ ఆగాడు.. లేదంటే యుక్రెయిన్‌పై అణుబాంబులు పడేవి – CIA చీఫ్ విలియం బర్న్స్

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు.. మరికొందరు వలసదారులయ్యారు.

సీఐఏ బిల్ బర్న్స్: మోదీ ఆపాడు కాబట్టే పుతిన్ ఆగాడు.. లేదంటే యుక్రెయిన్‌పై అణుబాంబులు పడేవి – CIA చీఫ్ విలియం బర్న్స్

CIA Director Bill Burns: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు.. మరికొందరు వలసదారులయ్యారు. ఈ యుద్దం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం కుదేలు చేసిందనే చెప్పవచ్చు. ఇకపోతే ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధాల వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలు రష్యన్‌లపై ప్రభావం చూపాయని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ విపత్తును నివారించడానికి ప్రధాని మోదీ సలహానే కారణమని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ బిల్ బర్న్స్ అన్నారు.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరియు ప్రధాని మోడీ కూడా అణ్వాయుధాల వినియోగం గురించి తమ ఆందోళనలను చర్చించడం చాలా ఉపయోగకరం అని భావిస్తున్నానంటూ సీఏఐ బిల్ బర్న్స్ తెలిపారు. ఇది రష్యన్‌లపై కూడా చాలా ప్రభావం చూపుతుందని అని బిల్ బర్న్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

cia-chief bill burns said pm-modis-views impacted-russia-ukraine-war

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం వారితో సంధి కుదర్ఛాడానికే పిలుపునిచ్చిందని సీఐఏ బర్న్స్ ఓ ఇంటర్వ్యూ ద్వారా పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో డిసెంబరు 16న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ కాల్ చేసి మాట్లాడారని..చర్చలు మరియు సంధి మాత్రమే ఈ యుద్ధం ముగింపుకు ఏకైక మార్గం అని ప్రధాని మోడీ పుతిన్ చెప్పారని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు, వ్లాదిమిర్ పుతిన్ ఉక్రేనియన్ దిశలో రష్యా యొక్క రేఖపై ప్రాథమిక అంచనాలను ఇచ్చారు” అని క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని బర్న్స్ పేర్కొన్నారు.

సమర్‌కండ్‌లో జరిగిన ఎస్సీఓ సమావేశంలో ప్రధాని మోదీ “నేటి యుగం యుద్ధం కాదు” అని అన్నారని.. ఇంతలో పుతిన్ మాట్లాడుతూ, “ఉక్రెయిన్ వివాదంపై మీ వైఖరి గురించి నాకు తెలుసని, మీ ఆందోళనల గురించి నాకు తెలుసని వీటన్నింటిని వీలైనంత త్వరగా ముగించాలని మేము కోరుకుంటున్నాము.” అని సమాధానం ఇచ్చారని ఆయన  తెలిపారు.

pm modi views impacted on russia ukrain war said cia chief bill burns

“నేటి యుగం యుద్ధం కాదు, దాని గురించి నేను మీతో కాల్‌లో మాట్లాడాను. ఈ రోజు మనం శాంతి మార్గంలో ఎలా అభివృద్ధి చెందవచ్చే దాని గురించి మాట్లాడే అవకాశం లభించిందని ప్రధాని అన్నారు. భారతదేశం మరియు రష్యా చాలా కాలం పాటు ఒకరితో ఒకరు కలిసి ఉన్నాయని.. భారతదేశం-రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరియు వివిధ సమస్యల గురించి మేము చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడామని ప్రధాని తెలిపారు. ఆహారం, ఇంధన భద్రత మరియు ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మేము మార్గాలను కనుగొనాలని ప్రధాని మోదీ అన్నారని ఆయన వెల్లడించారు

అంతకుముందు అక్టోబర్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ యుద్ధం అణు కేంద్రాలను ప్రమాదంలో పడేయడం ప్రజారోగ్యం మరియు పర్యావరణంపై విపత్కర పరిణామాలను కలిగిస్తుందని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఈ విధంగా రెండు దేశాల మధ్య సంధి కుదర్చడంలో భారత తరఫున ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ బిల్ బర్న్స్ వెల్లడించారు.

ఇదీ చదవండి: మీరు ఎప్పటికీ ఒంటరి కాదు.. మా పూర్తి మద్దతు ఉంటుంది.. జెలెనెస్కీతో జో బిడెన్

ఇవి కూడా చదవండి: