Yogi Babu: కారు ప్రమాదంలో మరణించిన స్టార్ నటుడు అంటూ వార్తలు – క్లారిటీ ఇచ్చిన యోగిబాబు

Yogi Babu Met a Accident: ప్రముఖ నటుడు, కమెడియన్ యోగిబాబు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న ఆయన కారుకు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో యోగిబాబు తీవ్రంగా గాయపడినట్టు సోషల్ మీడియాలో జోరు ప్రచారం జరిగింది. అంతేకాదు కొన్ని మీడియాలో అయితే ఆయన మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా తనపై వచ్చిన వార్తకు సంబంధించిన లింక్ కూడా షేర్ చేశారు.
“నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. రోడ్డు ప్రమాదం జరిగిన మాట నిజమే. కానీ ఆ కారులో నేను లేను. కనీసం నాకు సంబంధించిన వాళ్లు కూడా ఎవరూ లేరు. నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని వివరణ ఇచ్చారు. దీంతో యోగిబాబు అభిమానులంత ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన కారు ప్రమాదానికి గురైంది.
Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q
— Yogi Babu (@iYogiBabu) February 16, 2025
తమిళనాడులోని రాణిపేట సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్‌ని ఢీ కోట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారు ఉన్నవారంత సురక్షితంగా ఉన్నారని సమాచారం. ప్రమాదం సమయంలో ఆ కారులో తాను లేనని స్వయంగా యోగిబాబు స్పష్టం చేశారు. అయితే తాను ప్రమాదం బారిన పడినట్టు వార్తలు రావడంతో అభిమానులు, మీడియా ప్రతినిధుల నుంచి వరుసగా పోన్స్ కాల్స్ వచ్చాయని, తన క్షేమంగా గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. తన పట్ట చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి యోగి బాబు ధన్యవాదాలు తెలిపారు.