OTT Play Awards 2025: ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 – ‘వికటకవి’ వెబ్ సిరీస్‌కుగాను ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి

Pradeep Maddali Won OTT Play Awards 2025: మూడేళ్లుగా ప్రముఖ మీడియా సంస్థ ఓటీటీ ప్లే అవార్డ్స్‌ని అందిస్తు వస్తోంది. ఈ ఏడాదికి గానూ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఏడిషన్‌ని ఇటీవల ఘనంగా నిర్వహించింది. వన్ నేషన్, వన్ అవార్డు అనే థిమ్‌తో ఓటీటీలో అత్యుత్తమ కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ ఈ అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమానికి అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ వేడుకకు దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులైన నటీనటులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటీటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను ఈ ప్రఖ్యాత అవార్డుతో సత్కరించారు. డిస్పాచ్‌లో చిత్రంలో తన నటనగానూ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయి, ‘భామ కలాపం 2’కి గానూ ఉత్తమ నటిగా, ‘ది రానా దగ్గుబాటి షో’ ద్వారా టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తూ సెలబ్రిటీలతో ముచ్చట్లను పంచుకుంటున్నందుకుగానూ ఉత్తమ హోస్ట్‌గా రానా దగ్గుబాటిలు ఈ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఓటీటీ ప్లే అవార్డ్స్‌తో సదరు సంస్థ సత్కరించింది.
ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి
ఉత్తమ దర్శకుడిగా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఈ అవార్డు అందుకోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఇటీవల విడుదలైన వికటకవి తెలుగు వెబ్ సిరీస్‌గానూ ఆయన ఈ అవార్డును అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును పంచుకున్నారు. నటుడు నరేష్ అగస్త్య, మెఘా ఆకాశ్‌లు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వికటకవి వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది.
విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు ప్రదీప్ మద్దలి. 1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో జరిగిన ‘విక్కటకవి’ జ్ఞాపకాలను చెరిపేసే ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతిక్షణం ట్విస్ట్స్‌తో ఉత్కంఠగా రేపుతూ సాగే ఈ వెబ్ సిరీస్ మూవీ లవర్స్ బాగా ఆకట్టుకుంది. ఓ కల్పిత గ్రామీణ థ్రీల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించి ప్రదీప్ మద్దాలి తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి బ్యాగ్రౌండ్
టాలెంటెడ్ డైరెక్టర్‌గా యమ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ మద్దలి ఇంజనీరింగ్ చదివారు. చదువు తర్వాత ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న ఆయన సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకుడి తన సినీ కెరీర్ ప్రారంభించారు. 47 డేస్, సర్వం శక్తి మయం వంటి సిరీస్‌లతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన ఆయన వికటకవితో మరింత పాపులర్ అయ్యారు. దర్శకుడిగా ఆయన మరో స్థాయికి తీసుకువెళ్లింది ఈ వెబ్ సిరీస్. ఎందరో సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ వెబ్ సిరీస్‌గానూ ప్రముఖ మీడియా సంస్థ ఓటీటీ ప్లే అవార్డుతో సత్కరించింది.