Last Updated:

Spark Movie: ప్రేక్షకులలో “స్పార్క్” బజ్… యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మూవీ

వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా  ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Spark Movie: ప్రేక్షకులలో “స్పార్క్” బజ్… యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మూవీ

Spark Movie: వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా  ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ ఈ సినిమాను రూపొందిస్తోంది. కాగా ఈ చిత్రంలో ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా నటిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అరవింద్‌ కుమార్‌ రవివర్మ ఈ సినిమాతో దర్శకుడిగా సినీపరిశ్రమకు పరిచయమవుతున్నారు. రవివర్మ ఇంతకుముందు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం స్పార్క్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. “హృద‌యం” ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ మూవీకి ట్యూన్స్ అందిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా ఆడియన్స్ ముందు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ మూవీలో నాజర్, సుహాసిని, షియాజీ షిండే, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం అంతా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

ఇవి కూడా చదవండి: