Last Updated:

Prabhas: కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం 70 వేల మందికి భోజన ఏర్పాట్లు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత తన గడ్డ అయిన మొగల్తూరుకు వెళ్లనున్నారని తెలిసిన సమాచారం. సెప్టెంబర్ నెల 28న హైద్రాబాద్ నుంచి బయలు దేరి మొగల్తూరుకు వెళ్ళి, అక్కడే రెండు రోజులు ఉండనున్నారని తెలిసింది.

Prabhas: కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం 70 వేల మందికి భోజన ఏర్పాట్లు!

Tollywood: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత తన గడ్డ అయిన మొగల్తూరుకు వెళ్లనున్నారని తెలిసిన సమాచారం. సెప్టెంబర్ నెల 28న హైద్రాబాద్ నుంచి బయలు దేరి మొగల్తూరుకు వెళ్ళి, అక్కడే రెండు రోజులు ఉండనున్నారని తెలిసింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్కరణ సభతో పాటు భారీ సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిసిన సమాచారం. ఈ సంస్కరణ కార్యక్రమానికి ప్రభాస్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నారు. కృష్ణంరాజు కుటుంబంతో రానున్నారని మొగల్తూరులోని సొంత ఇంటి దగ్గర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయించాలని ప్రభాస్ ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లు తెలిసిన సమాచారం. దీని కోసం ద్రాక్షారామం నుంచి ప్రత్యేకంగా వంటవాళ్లను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. గతంలో కృష్ణంరాజు సినిమాల షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికి రెండు, మూడు సార్లు తమ సొంతూరు ఐనా మొగల్తూరుకు వెళ్ళి వచ్చే వారు. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లు నుంచి మొగల్తూరుకు వెళ్ళలేకపోయారు. ఈ నెల 11న ఉదయం ఆయన మరణించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ 23న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటి వద్ద దశదిన కార్యక్రమం జరగనుందని తెలిసిన సమాచారం.

follow us

సంబంధిత వార్తలు