SS Thaman: నేను మందు కొట్టను, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.. నేను ఏ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు అంటూ “థమన్” ఫైర్
SS Thaman: చిత్ర పరిశ్రమ ఒక సినిమా బాగుంటే ఎన్ని ప్రశంసలను అందిస్తుందో ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతే విమర్శలకు గురిచేస్తుంది. ఈ సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎవరివల్లా కాదు.
SS Thaman: చిత్ర పరిశ్రమ ఒక సినిమా బాగుంటే ఎన్ని ప్రశంసలను అందిస్తుందో ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతే విమర్శలకు గురిచేస్తుంది. ఈ సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎవరివల్లా కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఎక్కువ కొనసాగుతోంది. అన్ని విషయాలను నెట్టింట పంచుకోవడం ప్రజలు వాటికి రియాక్ట్ అవ్వడం పరిపాటిగా మారిపోయింది. దీనితో ప్రశంసలు విమర్శలు అదే స్థాయిలో అందుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లకే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ఎక్కువగా ట్రోల్స్ కు గురవుతున్నారు. అలా ట్రోల్స్ గురైనవారిలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఒకరు. ఆయనపై వస్తున్న ట్రోల్స్ అయితే మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచి కూడా థమన్ పై ట్రోలింగ్ ఎక్కువగానే ఉండేవి.. కాపీ ట్యూన్స్ వాడతాడని, ఒకేలాంటి మ్యూజిక్ ఇస్తాడని ఇష్టం వచ్చినట్లు ట్రోలర్స్ విరుచుకుపడేవారు. కాగా ఈ ట్రోలింగ్స్ పై ఎన్నోసార్లు థమన్ స్పందించాడు. అసలు తాను అలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.
అది నా ఎమోషన్(SS Thaman)
అయితే ఈ సారి బ్రో సినిమాకు మాత్రం అభిమానులు థమన్ పై మరోసారి విరుచుకుపడుతున్నారు. క్రికెట్ పై చూపే శ్రద్ద మ్యూజిక్ పై చూపితే బాగుంటుందంటూ థమన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. థమన్ క్రికెట్ పిచ్చిలో పడి మ్యూజిక్ ను పక్కన పడేశాడని, అందుకే ఇంత చెత్త ట్యూన్స్ ను ఇస్తున్నాడని ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకో విషయమేంటంటే మొదటి నుంచి కూడా థమన్ కు క్రికెట్ అంటే పిచ్చి. స్టేడియంలోకి దిగాడంటే పరుగుల వర్షం కురిపించాల్సిందే. కాగా ఈ ట్రోల్స్ పై తాజాగా థమన్ స్పందించాడు.
“నేను మందు కొట్టను, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.. ఎలాంటి వ్యాపకాలు లేవు.. నాకున్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. రాత్రి 9 గంటలకు.. అందరూ పడుకున్నప్పుడు వెళ్లి క్రికెట్ ఆడటం. మా టీమ్ మొత్తం 22 మంది ఉన్నాం.. మా టీమ్ పేరు థమన్ హిట్టర్స్. మేము రోజు రాత్రి మ్యాచ్ ఆడుతాం. ఇది నా ఎక్సర్ సైజ్.. నా ఎమోషన్. దీని గురించి ఎవరికి నేను జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా పని వదిలేసి నేను వెళ్లడం లేదు. రోజూ రాత్రి 9 గంటలకు మ్యాచ్ కు వెళ్లి 2 గంటలకు ఇంటికి వచ్చి, చక్కగా వేడినీళ్లతో స్నానం చేసి పడుకుంటాను. ఇది నా హెల్త్ కు ముఖ్యం.. నా స్ట్రెస్ బస్టర్. దీన్ని కూడా తప్పుగా చూస్తుంటే నాకు బాధగా ఉంది. తెల్సినవాళ్ళే ఇలా తప్పుగా రాస్తున్నారు.. అది చాలా బాధగా ఉంది. ఇదిగో థమన్.. నువ్వు పని ఆపేశావ్ అని ఇంతవరకు నాపై ఒక్క డైరెక్టర్ కంప్లైంట్ చేయలేదు.. ఒక్క నిర్మాత కూడా నాపై కంప్లైంట్ చేయలేదు.. నేను మ్యూజిక్ పై ఎంత శ్రద్ద పెడతాను.. నాకొచ్చే రెమ్యూనిరేషన్ లో ఎంత ఖర్చు పెడతాను అనేది వారికి కూడా తెలుసు. ఇక్కడ, నేను ఏ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది నా ఎమోషన్.. ఒకడు మందు కొడతాడు.. ఇంకొకడు డ్యాన్స్ చేస్తాడు.. అలాగే నేను క్రికెట్ ఆడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.