Last Updated:

Liger Effect: లైగర్ ఎఫెక్ట్.. ’జనగణమన‘ నుంచి దూరంగా జరిగిన నిర్మాతలు

లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

Liger Effect: లైగర్ ఎఫెక్ట్.. ’జనగణమన‘ నుంచి దూరంగా జరిగిన నిర్మాతలు

Tollywood: లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. అయితే ఆర్థికంగా లాభదాయకంగా లేదని భావించి ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాధ్ మరియు విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ గురించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నిర్మాత దొరికితే అది జరుగుతుంది. లేకపోతే, పూరి మై హోమ్ గ్రూప్ కోసం మరో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ ముంబైలో ఉన్నారు. ఈ వారాంతంలో తిరిగి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. లైగర్ డిస్ట్రిబ్యూటర్లను కలుసుకుని నష్టాన్ని వాపసు చేయడానికి సిద్దం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: