OG Movie : పవన్ కళ్యాణ్ #OG మూవీలో “అర్జున్ దాస్”.. మీ మాటలు మర్చిపోలేనంటూ ట్వీట్ !
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది.
OG Movie : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
అయితే తాజాగా ఈ మూవీలో ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్ నటించబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వాటిని నిజం చేస్తూ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. అయితే మూవీ యూనిట్ ప్రకటనకు ముందే అర్జున్ దాస్ ఈ సినిమాలో నాటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అలానే తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు.
ఆ నోట్ లో.. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో నాకు తెలీదు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్‌లో దిగాను. OG సెట్‌కు వెళ్లి చిత్ర బృందాన్ని కలిశాను. చాలా నెర్వస్‌గానూ, ఎగ్జయిటెడ్‌గానూ అనిపించింది. కానీ, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలవడం నమ్మలేని నిజం. సెట్‌లో నేను ఉన్న పిక్చర్ ఒకటి నిన్న బయటికి వచ్చింది. అప్పటి నుంచీ నన్ను అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు.. ‘ఓజీలో ఉన్నారా?’. నాకు ఏం చెప్పాలో తెలీదు, అప్పటికి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మొత్తానికి ఇప్పుడు నేను చెప్పగలను.. అవును నేను ఓజీలో ఉన్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు సుజీత్ గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు దానయ్య గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు థాంక్ యు సో సో మచ్. నిన్న మీరు నాకు చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీరు కలిసి పనిచేయడానికి, తెరను పంచచుకోవడానికి వేచి చూస్తున్నాను. ప్రెస్, మీడియా, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు, స్వాగతిస్తున్నందుకు, ప్రోత్సాహం ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ప్రాణం పెడతానని హామీ ఇస్తున్నాను. మీ అందరి ఆశీర్వాలు, ప్రోత్సాహం నాకెప్పుడూ ఉండాలి’ అని తన నోట్‌లో అర్జున్ దాస్ పేర్కొన్నారు.
— DVV Entertainment (@DVVMovies) June 10, 2023
ఇక ఈ నోట్ ని రీట్వీట్ చేస్తూ డివివి సంస్థ అర్జున్ దాస్‌కు తమ (OG Movie) ప్రాజెక్ట్‌లోకి స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. ఆయన పవర్‌ఫుల్ వాయిస్, ప్రజెన్స్ సినిమాను మరింత వైబ్రెంట్‌గా మార్చాయని రాసుకొచ్చింది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటించనున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ అప్డేట్ తో మూవీపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.