Last Updated:

SSMB29: ‘పోకిరి’లో పండు.. ‘గుంటూరు కారం’లో రమణ.. SSMB29లో మహేష్‌ పాత్ర పేరేంటో తెలుసా?

SSMB29: ‘పోకిరి’లో పండు.. ‘గుంటూరు కారం’లో రమణ.. SSMB29లో మహేష్‌ పాత్ర పేరేంటో తెలుసా?

Mahesh Babu Role Name in SSMB29: ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ29(SSMB29) ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబోలో పాన్‌ వరల్డ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమా అప్‌డేట్స్‌ విషయంలో జక్కన్న గొప్యత పాటిస్తున్నాడు. కనీసం మూవీ లాంచ్‌ చేసిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ని కూడా మొదలెట్టారు.

ఒరిస్సాలో యాక్షన్‌..

ప్రస్తుతం ఈ సినిమా ఒరిస్సా ఆటవీ ప్రాంతంలో షూటింగ్‌ని జరుపుకుంటోంది. ఇది దాదాపు 15 రోజుల షెడ్యూల్‌ అట. అక్కడ యాక్షన్‌ అడ్వెంచర్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా నటీనటులు వివరాలు ఏవి కూడా ప్రకటించలేదు. సైలెంట్‌ SSMB29ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీపై సంబంధించి రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదే ఈ మూవీ టైటిల్‌, మహేష్‌ బాబు రోల్‌.

ఈ సినిమా కోసం మహేష్‌ సరికొత్త లుక్‌లోకి మారాడు. ఇందుకోసం విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని మహేష్‌ని చూడబోతున్నామని ఇప్పటి వరకు బయటకు వచ్చిన లుక్స్‌ చూస్తే అర్థమైమవుతోంది. అయితే ఇందులో మహేష్‌ పాత్ర పేరు రుద్ర అనే ఓ వార్త బయటకు వచ్చింది. ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ కాబట్టి ప్రతి అంశం సరికొత్త ఉంటుందని ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇక మొదటి నుంచి తమ చిత్రంలో మహేష్‌ పాత్రలో కొత్తదనం ఉండేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోకిరి నుంచి గుంటూరు కారం వరకు పాత్రల పేర్లు హైలెట్‌గా నిలుస్తుంటాయి.

రుద్రగా మహేష్?

‘అతడు’లో పార్థు, ‘పోకిరి’లో పండు, ‘ఖలేజా’లో సీతారామరాజు, ‘గుంటూరు కారం’లో రమణ.. ఇలా తన రోల్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమాలో ఈ పేరు కూడా హైలెట్‌ అవుతుంది. ఇప్పుడు SSMB29లోనూ మహేష్‌ రోల్ కి సంబంధించిన ఓ పేరు ప్రచారంలో ఉంది. రుద్ర అనే పేరును పరిశీలిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్‌ చేసినవన్ని రీజినల్‌ సినిమాలే. కాబట్టి అక్కడి వరకు ఆయన పాత్రల పేర్లు హైలెట్‌ అయ్యాయి.

ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ. ఇందులో నేషనల్‌ కాదు ఇంటర్నేషనల్‌ రేంజ్‌. మరి ఆ స్థాయిలో మహేష్‌ క్రేజ్‌ను పెంచేలా పాత్ర పేరు ఉండాలి. రుద్ర అనేది తెలుగు వరకు ఒకే. కానీ, పాన్‌ వరల్డ్‌ క్రేజ్‌కు ఇది సెట్‌ కాకపోవచ్చని, దీనిని ఆడియన్స్ ఓన్‌ చేసుకునే చాన్సస్‌ తక్కువ అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రచారంలో ఉన్న పేరు మాత్రమే. నిజానికి జక్కన్న ప్లాన్‌ ఏంటనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నట్టు వినికిడి. పాన్‌ వరల్డ్‌ కాబట్టి టైటిల్‌ కాస్తా ఇంగ్లీష్‌ పేరు కూడా ఉండేలా మూవీ టీం టైటిల్‌ని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.