Last Updated:

Adipurush : ఆ జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు.. రీజన్ ఏంటంటే ?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.

Adipurush : ఆ జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు.. రీజన్ ఏంటంటే ?

Adipurush : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. మరోవైపు ‘జై శ్రీరామ్‌’ పాట యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ మొదటి సారి రాముడిగా కనిపించబోతున్నారు. అలానే ఈ సినిమా (Adipurush) ప్రీరిలీజ్ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు.  అదే విధంగా ఈ సినిమా టికెట్లు కూడా ప్రత్యేకంగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ టీమ్ ప్రతీ సినిమా హాల్ లో హనుమంతుని కోసం ఓ సీట్ ఖాళీగా ఉంచబోతున్నారు. రామ నామ స్మరణ జరిగే ప్రతీ చోట హనుమ ఉంటాడన్న నినాదంతో.. ప్రతీ హాల్ లో ఆంజనేయుడి కోసం ఓ సీట్ ని రిజర్వ్ చేశారు.

అలానే పేద పిల్లల కోసం బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్.. 10 వేల టికెట్లకు పైగా బుక్ చేశారు. ఇక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పేద వారి కోసం 10 వేల టికెట్లు బుక్ చేశారు. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముడు కోలువై ఉండటంతో.. ఈ జిల్లాకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.