Published On:

Liquor Prices: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పెంచే యోచనలో సర్కార్!

Liquor Prices: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పెంచే యోచనలో సర్కార్!

Liquor Prices Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్. త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బీర్లపై 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. త్వరలోనే అన్నింటిపై ధరలు పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది.

 

ప్రధానంగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం మద్యం ధరలు పెంచితే ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ. 50వరకు పెరగనుంది. అయితే, ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ధరల పెంపు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

ఇదెలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలను ప్రభుత్వం పెంచింది. బీర్లపై 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఒక్కో బీరుపై దాదాపు రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడంతో మద్యం ప్రియులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ లిక్కర్ ధరలు పెరిగితే ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.