Sandhya Theatre: 45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు – తొక్కిసలాటపై సంధ్య థియేటర్ వివరణ
Show Cause Notice to Sandhya Theatre: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా మ్రతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచిన ఇంకా శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది.
అయితే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ కారణమని ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో థియేటర్ యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు హీరో అల్లు అర్జున్‌ని కూడా అరెస్ట్ చేయగా.. ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. దీనిక తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. అయితే ఈ ఘటనలో పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో చెబుతూ సరైన వివరణ ఇవ్వాల్సిందిగా థియేటజర్ యాజమాన్యాన్ని ఆదేశించినట్టు నోటీసులో పేర్కొన్నారు. తాజాగా ఈ నోటీసులకు సంధ్య థియేటర్ వివరణ ఇచ్చింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను పోలీసులకు ఇచ్చింది. ఇందులో “గత 45 ఏళ్లుగా ఈ థియేటర్‌ని నడుపుతున్నాం. ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ 45 ఏళ్లలో ఎంతోమంది హీరోలు సినిమా చూసేందుకు చాలాసార్లు వచ్చారు.
ఎన్నో సినిమాల ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు వేశాం. కానీ ఎన్నడూ కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఆ రోజు పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా థియేటర్ వద్ద 80 మంది విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో మైత్రీ మూవీ మేకర్స్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకుంది. గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా మా థియేటర్‌కు ఎంతోమంది హీరోలు వచ్చారు. తమ దగ్గర ద్విచక్రవాహనం, ఫోర్ వీలర్‌కు ప్రత్యేకమైన పార్కింగ్ ఉంది” అని సంధ్య థియేటర్ వివరణ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించారు.