Last Updated:

Sammelanam Web Series: పుస్తకం చుట్టూ తిరిగే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘సమ్మేళనం’ – ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త వెబ్‌ సిరీస్‌

Sammelanam Web Series: పుస్తకం చుట్టూ తిరిగే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘సమ్మేళనం’ – ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త వెబ్‌ సిరీస్‌

Sammelanam Web Series OTT Release: ప్రస్తుతం చిన్న సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కంటెంట్‌లో దమ్ము ఉంటే చాలు మూవీ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలంటే స్టార్‌ కాస్ట్‌, స్టార్‌ డైరెక్టర్‌ అవసరం లేదని ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌, స్నేహం విలువలను చూపించే కథలకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. గతేడాది మెగా డాటర్ నిహారిక నిర్మాతగా కొత్త కుర్రాళ్లతో వచ్చిన కమిటీ కుర్రాళ్లు సినిమా థియేటర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది.

ఊరీ జాతర ప్రాముఖ్యతను, స్నేహం విలువను చేప్పే చిత్రంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో మరో యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. కాలేజీ రోజుల నాటి స్నేహితుల కబుర్లు, ప్రేమ తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకునేఓ యువకుడి కథ నేపథ్యంలో సమ్మేళం పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ప్రియా వడ్లమాని, గానాదిత్య, విఘ్నయ్‌ అభిషేక్‌, బిందు తదితరులు ప్రధాన పాత్రల్లో తరుణ్‌ మహదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ రోజులో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ వచ్చింది.

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ను సమ్మేళంనం అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. యూత్‌ టార్గెట్‌గా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ని సునయానీ, సాకేత్‌ సంయుక్తంగా నిర్మించారు. మరి దూరమైన స్నేహితులను ఆ కాలేజీ రోజుల నాటి పుస్తకం మళ్లీ ఒక్కటి చేసిందా? స్నేహం, ప్రేమలో ఉన్న గందరగోళంతో ఆ స్నేహితులు ఎదుర్కొన్న పరిణామాలను ‘సమ్మేళం’ అంటూ ఆసక్తిగా తెరకెక్కించారు. మరి ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి: