Last Updated:

Sikandar Teaser: సల్మాన్‌ ఖాన్‌ సికందర్‌ నుంచి రెండో టీజర్‌.. చూశారా?

Sikandar Teaser: సల్మాన్‌ ఖాన్‌ సికందర్‌ నుంచి రెండో టీజర్‌.. చూశారా?

Sikandar Official Film Teaser: బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సికందర్‌'(Sikandar). ఈథ్‌ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక తాజాగా మేకర్స్‌ మరో టీజర్‌ని విడుదల ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. తాజాగా విడుదలైన టీజర్‌ మూవీ అంచనాలను మరింత పెంచేస్తోతంది. ఫుల్‌ అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌తో ఈ టీజర్‌ సాగింది. ఇందులో సల్మాన్‌ లుక్‌, యాక్టింగ్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక రష్మిక మందన్నా, సల్మాన్‌ ఖాన్‌ల సీన్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ, ఫన్ని డైలాగ్స్‌ మెప్పించేలా ఉన్నాయి.

హిందీలో ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న రెండోవ చిత్రమిది. దీంతో సికందర్‌పై నార్త్‌తో పాటు సౌత్‌లో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ టీజర్‌ చూస్తుంటే మరోసారి సికందర్‌తో ఏఆర్‌ మురుగదాస్‌ తన మార్క్‌ చూపించేలా ఉన్నారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్, సత్యరాజ్‌, శర్మన్‌ జోషి, ప్రతీక్‌ బబ్బర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈథ్‌ సందర్భంగా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం ప్రేక్షకుల ముందకు రానుంది.

ఇవి కూడా చదవండి: