Sai Pallavi: ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి! – ఫస్ట్‌టైం నితిన్‌కి జోడిగా..
Sai Pallavi Star in Nithiin Yellamma: నితిన్ హీరోగా బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిదా మూవీలో సాయి పల్లవి, భానుమతి పాత్రలో తెలంగాణ యువతిగా అద్భుతమైన నటన కనబర్చింది.
ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె మాటలకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఎల్లమ కూడా తెలంగాణ నెగిటివిటీతో రావడంతో ఇందులో సాయి పల్లవి అయితే న్యాయం చేస్తుందని మూవీ టీం నమ్ముతుంది. దీంతో ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. వెంటనే సాయి పల్లవి కలిసి డైరెక్టర్ వేణు కథ, ఆమె పాత్ర గురించి వివరించారట. పాత్ర, కథ బాగా నచ్చటంతో సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మూవీ నుంచి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు వేచి చూడాల్సిందే.
కాగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రీల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ‘ఎల్లమ’ను (ప్రచారంలో ఉన్న టైటిల్) సెట్స్‌పైకి తీసుకురావాలని వేణు అనుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ‘రామాయణ’లో నటిస్తుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడు కాగా, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026లో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది.