Published On:

AP Inter Advanced Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

AP Inter Advanced Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

AP Inter Advanced Supplementary Results Released: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఏడాదికి సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను గత నెల మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించారు.

 

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌కు 1,35,826 మంది హాజరవ్వగా.. సెకండియర్‌ పరీక్షకు 97,963 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇంటర్ స్టూడెంట్స్ https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇందులో ఫస్టియర్ జనరల్‌తో పాటు సెకండియన్ జనరల్.. అలాగే ఫస్టియర్ ఒకేషనల్, సెకండియర్ ఒకేషనల్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.