Radhika Sarathkumar: హీరోయిన్ రాధికకు సర్జరీ – ఎమోషన్ పోస్ట్ షేర్ చేసిన నటి

Radhika Sarathkumar About Her Health: మహిళలలు ఎప్పుడూ ఎవరి సింపతి కోరకూడదు.. ప్రతి స్త్రీ తనని తాను మరింతగా ప్రేమించుకోవాలంటూ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికి నటి రాధిక శరత్ కుమార్ ఓ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు నెలల క్రితం తాను ఎదుర్కొన్న ఓ గడ్డు పరిస్థితి గురించి పంచుకున్నారు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. “గత రెండు నెలలుగా నేను ఎంతో గడ్డు పరిస్థితిని చూశాను.
ఎవరూ దాని గురించి అడగనే లేదు..
ఎవరూ కూడా నా వర్క్, నా గురించి మాట్లాడలేదు. నా పరిస్థితిని కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం నేను రెండు సినిమాల్లో నటించాను. రెండు సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా కాలికి తీవ్రమైన గాయం అయ్యింది. సినిమా కోసం అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నామోకాలికి గాయం అయ్యింది. మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల పెయిన్ కిల్లర్స్, మోకాలి బ్రేస్, క్రయోథెరపీలు వాడాను. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు సర్జరీ సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రెండు నెలల క్రితం సర్జరీ చేయించుకున్నాను” అని చెప్పారు.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి..!
సర్జరీ తర్వాత నొప్పితోనే సినిమా షూటింగ్స్ పూర్తి చేశాను. అప్పుడు ఎవరూ కూడా నా ఆరోగ్యం, నా బాధ గురించి అడగలేదు. మూవీ టీం కూడా నా కష్టాన్ని గుర్తించలేదు. నా పరిస్థితిని గమనించిన నా స్నేహితులు ఒకరు ఆశ్చర్యపోయారు. ఇంత బాధతోనే షూటింగ్ పూర్తి చేశారు.. ఇందుకు నిర్మాతలు మీకు కృతజ్ఞతలు చెప్పారా? అని అడిగారు. కానీ తనకు కృతజ్ఞతలు వంటివి అవసరం లేదన్నారు. అలాంటివి తాను పట్టించుకోనని, తానేప్పుడు ఇలాంటి ఆశించలేదననారు. మన పనేంటి? పనిపై మాత్రమే దృష్టి పెడతానని తన స్నేహితుడికి బదులిచ్చినట్టు చెప్పారు.
మహిళా దినొత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మాత్రమే ఎక్కువగా ప్రేమించుకోవాలన్నారు. ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాలని తాను కోరుకుంటున్నట్టు ఆమె అన్నారు. అలాగే స్త్రీ ఎప్పుడూ కూడా ఒకరి సింపతి తీసుకోవద్దన్నారు. అయితే శస్త్ర చికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్‌కుమార్ తనని చిన్నపిల్లలా చూసుకున్నారంటూ రాధిక మురిసిపోయారు. తన జీవితంలో తన భర్త తనకు మూలస్థంభంలాంటి వ్యక్తి అన్నారు.
View this post on Instagram