Chiranjeevi: మీ అందరికి చేతులెత్తినమస్కరిస్తున్నా – ఉమెన్స్ డే సందర్బంగా చిరంజీవి స్పెషల్ పోస్ట్

Chiranjeevi Womens Day Wishes: మహిళా దినోత్సవం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశారు. నేడు (మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే(International Womens Day 2025). ఈ సందర్భంగా చిరంజీవి తనతో హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా వారందరికి ఉమెన్స్ డే ప్రత్యేకమైన విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌లో స్పెషల్ ఫోటో షేర్ చేశారు.
“నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావత్ మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణలో నిలిచింది. చిరు షేర్ చేసిన ఈ ఫోటోలు అలనాటి హీరోయిన్లంతా ఒకే ఫ్రేంలో ఉండటంతో వారి అభిమానులకు కనులవిందుగా ఉంది. ఇందులో నటి సుహాసిని, రాధిక శరత్‌కుమార్, జయసుధ ఖుష్బు సుందర్, నదియా, మీనా, జయ, టబులు ఉన్నారు. వారి మధ్య చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫోటోల నెట్టింట తెగ సందడి చేస్తుంది.
నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన
నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ
మహిళా దినోత్సవశుభాకాంక్షలు.
#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025