YS Jagan: సింగయ్య మృతి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పోలీసుల నోటీసులు

Police Notices to YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీచేశారు. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందపడి దుర్మరణం చెందాడు. ఘటనలో గుంటూరు పోలీసులు జగన్‌తోపాటు ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్‌ను ఏ2గా, కారు యజమాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను నిందితులుగా చేర్చారు.
సింగయ్య ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద జగన్‌పై పూలు చల్లేందుకు ముందుకు వెళ్తూ జారి కారు కింద పడ్డారని, వీడియో ఆధారాలు, సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలో జగన్ కారు సింగయ్యను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం పోలీసులు తాడేపల్లిగూడెంలోని జగన్ కార్యాలయానికి వెళ్లారు. అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యాలయం కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. జగత్‌పాటు భద్రతా సిబ్బంది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్..
వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సొంత డబ్బులతో కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు.
జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు. దాంతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసుకున్నారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ 26 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇప్పుడు జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.