Vijay Devarakonda: రష్మికను అలా వదిలేసావ్ ఏంటి విజయ్? – రౌడీ హీరోపై మండిపడుతున్న నెటిజన్స్
Vijay Deverakonda Gets Criticised: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. రష్మికను పట్టించుకోకుండ అలా వదిలేయడమేంటని అసహనం చూపిస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తరచూ వీరిద్దరు కలిసి లంచ్, డిన్నర్ డేట్స్‌కి వెళ్లి మీడియా కంట పడుతుంటారు. అంతేకాదు సీక్రెట్‌గా వెకేషన్‌కి వెళ్లి విడివిడిగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. అయితే లోకేషన్స్ బట్టి వీరిద్దరు కలిసి వెళ్లారని నెటిజన్స్ పట్టేస్తుంటారు.
అలా వీరిద్దరు తరచూ తమ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలిచే ఈ జంట తాజాగా మరోసారి మీడియా కంట పడింది. అయితే ఈ సారి విజయ్ తీరుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా విజయ్, రష్మికలు హైదరాబాద్‌లో కనిపించారు. ఓ హోటల్ నుంచి వీరిద్దరు బయటకు వస్తున్నారు. ముందు విజయ్ హడావుడి వెళ్లి కారు ఎక్కాడు. వెనకాల రష్మిక ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వస్తుంది. ఇది అంతా విజయ్ తీరుపై అభ్యంతర తెలుపుతున్నారు. నడవలేక స్థితిలో ఇబ్బంది మెట్లు దిగుతూ వస్తున్న ఆమెకు కాస్తా సాయం చేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. అలా పట్టించుకోకుండ వదిలేసి వస్తావేంటని అసహనం చూపిస్తున్నారు.
ఇక విజయ్ కారు ఎక్కగానే రష్మిక తన టీం సాయంతో మెల్లి మెల్లిగా నడచుకుంటూ వచ్చి కారు ఎక్కంది. కాగా ఇటీవల జిమ్‌లో చేస్తుండగా గాయపడినట్టు రష్మిక న్యూ ఇయర్ ప్రారంభంలో తన హెల్త్ అప్డేట్ ఇచ్చిన సంగత తెలిసిందే. కాలి గాయంతోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికానని, ఇది తనకు తాను ఇచ్చుకున్న న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ గాయంతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అంతేకాదు నడవలేని స్థితిలోనే తన లేటెస్ట్ హిందీ మూవీ ఛావా ప్రమోషన్స్ చేస్తోంది. విక్కీ కౌశల్‌తో జంటగా నటించి ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మూవీ ప్రమోషన్స్‌కి రష్మిక వీల్‌చైర్‌పై హాజరైంది. అక్కడ నడవలేక ఇబ్బంది పడుతున్న ఆమెకు విక్కీ హెల్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.