Monsoon Seasonal Diseases: వర్షాకాలంలో శొంఠి, మునగ ఆకులు, పసుపును ఇలా వాడితే రోగాలు దరిచెరవు!

Remedies for Monsoon Seasonal Diseases: వర్షాకాలం వచ్చేసింది. ఇది వస్తూనే వర్షంతోపాటు వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. గాలిలో కాలానుగుణమైన ఇన్ఫెక్షన్లను కూడా తీసుకువస్తుంది. దగ్గు, జలుబు లాంటి సాధారణ సమస్యలకు కారణమవుతుంది. అయితే సీజనల్ గా మనిషి తనను తాను రక్షించుకోవాలి. అందుకు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రోగనిరోధకశక్తిని పెంచే అద్భుతమైవి రెండు. అందులో మొదటిది శొంఠి, రెండవది మునగఆకు పొడి. ఇవి రెండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
శొంఠి అంటే మరేమిటో అనుకునేరు.! ఎండిన అల్లంను పొడిగా చేసుకుంటే దానినే శొంఠి అంటారు. వర్షాకాలం వస్తూ రుతుపవనాలను కూడా పట్టుకువస్తుంది. అయితే అందులో కాలానుగుణ ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి. తేమతో కూడిన గాలిలో బ్యాక్టీరియా, వైరస్లు ఉండే అవకాశం ఉంది, దీని వలన మనుషులకు జలుబు, దగ్గు మరియు జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందుకు పరిష్కారంగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడే బదులు మన ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ జబ్బులకు రోగనిరోధక శక్తిని పెంచుకుంటే సరిపోతుందని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనవి శొంఠి(ఎండిన అల్లం పొడి), పసుపు.
శొంటి ( ఎండిన అల్లం పొడి)
శొంఠి శక్తివంతమైన పదార్ధం. వర్షాకాలంలో శ్వాసకోశం నిమ్మతో, జలుగురుతో ఉండే అవకాశం ఉంది. అయితే శొంఠిని శ్వాసకోశాన్ని క్లియర్ చేయడానికి వాడతారు. ఇలా చేస్తే సాధారణంటా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి నివారించడానికి సహాయపడుతుంది. సగం టీ స్పూన్ శొంఠిన గోరువెచ్చని పాలల్లో, నీళ్లల్లో కలిపి తీసుకోవచ్చు. అవసరమైతే ఇందులో బెల్లం, తులసి ఆకులు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని టీ లాగా తాగవచ్చు. గొంతులో గరగర, జలుబు, దగ్గు లాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే శొంఠిని ఎక్కువగా వాడకూడదు. ఇది వేడి చేసే పదార్థం. ఆయుర్వేదం సూచించే మందులను ఎప్పుడు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అవి వేడి తత్వాన్ని కలిగి ఉంటాయి.
మునగ ఆకులు
మునగ ఆకుల్లో మిటమిన్ సి,ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగ పౌడర్ ను లేక ఆకులను పప్పులలో, కూరలలో వాడుకోవచ్చు. ఇది అత్యంత సులభం. మామూలుగా మనం పాలకూరను ఎలా వాడతామో దీన్ని కూడా అలాగే వాడాలి.
పసుసు
పసుసు అత్యంత శక్తివంతమైన దినుసు, దీన్ని వాడటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. దీన్ని పాలల్లో కలిపి తీసుకోవచ్చు.
తులసి
తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది. ప్రతీ రోజు రెండు మూడు తులసి ఆకులను తినడం వలన శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి దూరం అవుతాయి. వర్షాకాలంలో తులసి టీలో ఒక చుక్క తేనె కలిపి తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందులో అల్లం మరియు దాల్చిన చెక్కకూడా వేసుకోవచ్చు.