Published On:

‘The Raja Saab’ Pre Teaser: సర్‌ప్రైజ్‌.. ది రాజాసాట్‌ ప్రీ టీజర్‌.. చూశారా..?

‘The Raja Saab’ Pre Teaser: సర్‌ప్రైజ్‌.. ది రాజాసాట్‌ ప్రీ టీజర్‌.. చూశారా..?

Prabhas The Raja Saab Pre Teaser Out Now: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ‘ది రాజా సాబ్‌’ ఒకటి. డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పుడిప్పుడే వరుస అప్‌డేట్స్‌ వస్తున్నాయి. షూటింగ్‌ ఎప్పుడు మొదలైంది, ఎంత వరకు జరిగిందనేది క్లారిటీనే లేదు. కొన్ని రోజుల ముందు వరకు అసలు ఈ సినిమా ఉందా? అనే సందేహాలు కూడా వచ్చాయి.

 

కానీ, గతేడాది ప్రభాస్‌ పోస్టర్స్‌ బయటకు రావడంతో ది రాజాసాబ్‌ మూవీపై బజ్‌ నెలకొంది. ఇక ఆయన బర్త్‌డే సందర్‌భంగా విడుదలైన లుక్‌కు ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ది రాజాసాబ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. జూన్‌ 16న టీజర్‌ విడుదల కానుంది. దీనికి ఇంకా ఒక్క రోజు ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచుతూ ప్రీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

 

ఇందులో ప్రభాస్‌ లుక్‌ రివీల్‌ కాకుండ.. డార్క్‌ థీమ్‌లో విడుదల చేశారు. కేవలం 25 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రీ టీజర్‌లో అలా పాత్రలు జస్ట్‌ క్లిక్‌ మనిపించారు. దీనికి టీజర్‌ లోడింగ్‌ అంటూ అందరికిలో మరింత ఆసక్తిని పెంచారు. ప్రీ టీజర్‌ యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌ అందుకుంది. ఇక రేపు విడుదలయ్యే అసలైన టీజర్‌ ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి. కాగా హారర్‌, కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతి కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. పీపుల్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.