Last Updated:

Mufasa: The Lion King OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీకి వచ్చేస్తోన్న ముఫాసా – అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Mufasa: The Lion King OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీకి వచ్చేస్తోన్న ముఫాసా – అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Mufasa: The Lion King OTT Streaming Update: డిస్నీ చిత్రాల ప్రియులకు గుడ్‌న్యూస్‌. మరికొన్ని గంటల్లో ముఫాసా: ది లయన్‌ కింగ్‌ ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ సంస్థ నుంచి సినిమా వస్తున్నాయంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండ థియేటర్లకు క్యూ కడుతుంటారు. అలాంటి ఈ బ్యానర్‌ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన చిత్రమే ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’. మ్యూజికల్‌ లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా గతేడాది డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంది.

ఒక్క ఇంగ్లీష్‌లోనే కాదు తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ అందుకుని హిట్‌ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ రెడీ అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీకి వస్తుండటంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మరి ముఫాసా: ది లయన్ కింగ్ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడు, స్ట్రీమింగ్‌ ఎక్కడనేది ఇక్కడ చూద్దాం.

రెండు నెలల తర్వాత..

2019లో వచ్చి ది లయన్‌ కింగ్‌ చిత్రానికి ప్రీక్వెల్‌గా ముఫాసా చిత్రాన్ని తెరకెక్కించారు. ది లయన్‌ కింగ్‌లో ముఫాసా తనయుడు సింబా గురించి చూపించారు. ప్రీక్వెల్‌లో ముఫాసా, అతడి సోదరుడు స్కార్‌ల ప్రధానంగా చూపించారు. అనాథయిన సింహం అడవికి రాజు ఎలా అయ్యిందనేది ముఫాసా కథ. ఇందులో ముఫాసా, స్కార్‌ పాత్రలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అకాడమీ అవార్డు విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇంగ్లీష్‌లో ఇండియన్‌ భాషల్లో ఒకేసారి నిర్మితమైన ఈ సినిమా లీడ్‌ రోల్‌కి తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, హిందీలో షారుఖ్‌ ఖాన్‌లు డబ్బింగ్‌ చెప్పారు.

మహేష్ బాబు డబ్బింగ్

ఇక తెలుగులో మహేష్‌ బాబు డబ్బింగ్‌ చెప్పడంతో ముఫాసా: ది లయన్‌ కింగ్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. అలా భారీ అంచనాల మధ్య విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. అయితే ఇప్పటికే ఈ సినిమా అమెజాన్‌ ప్రైంలో రెంటల్‌ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఫ్రీ చూసే అవకాశం కల్పిస్తూ ఈ సినిమా ఓటీటీలోకి తీసుకువస్తుంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ సినిమా మార్చి 26న డిజిటల్‌ స్ట్రీమింగ్‌కి ఇస్తున్నట్టు రెండు రోజులు క్రితమే సదరు సంస్థ ప్రకటించింది. అంటే నేటి అర్థరాత్రి నుంచి ముఫాసా జీయోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగులో పాటు ఇంగ్లీష్‌, హిందీ, తమిళ్‌ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ విషయం తెలిసి మూవీ లవర్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.