Janhvi Kapoor: ఆ నొప్పి మగాళ్లు తట్టుకోలేరు.. అణుయుద్ధాలు జరుగుతాయి

Janhvi Kapoor: అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ జూనియర్ అతిలోక సుందరి.. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. తాజాగా జాన్వీ.. ఆడవారి పీరియడ్స్ బాధ గురించి చెప్పుకొచ్చింది. అది వర్ణనాతీతం అని తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ” నాకు నెలసరి సమయంలో ఎక్కువ మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆ సమయంలో నా మాటతీరును బట్టి అందరు ఇట్టే గుర్తుపడతారు.
చిరాకుగా నేను ఏది మాట్లాడినా.. నీకు ఆ సమయమా అని అడుగుతారు. అయితే అందరూ ఒకేలా అడగరు. కొందరి దృష్టిలో అది చాలా చిన్న విషయం.. చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. అదే నాకు బాధను కలిగిస్తుంది. కొందరు మన పరిస్థితిను అర్ధం చేసుకుంటారు. రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఈ పెయిన్ అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. పీరియడ్ సమయంలో మా మానసిక పరిస్థితి మగాళ్లకు ఎప్పుడు అర్ధం కాదు. వాళ్లు ఒక్క నిమిషం కూడా ఆ నొప్పి కనుక మగాళ్లకు వస్తే.. అణుయుద్దాలు జరుగేవేమో” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే జాన్వీ.. కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.