Janhvi Kapoor: ఈ ఏడాది బెస్ట్ మూవీ అదే.. అమరన్‌పై ఆసక్తి విషయాలు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
Janhvi Kapoor reviews Sivakarthikeyan and Sai Pallavi’s Amaran: తమిళ అగ్ర హీరో శివ కార్తికేయన్, నటి సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటి జాన్వీకపూర్ రివ్యూ ఇచ్చారు. 2024లో వచ్చిన సినిమాలన్నింటిలో ‘అమరన్’ ది బెస్ట్ మూవీ అని ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాను చూడటం కాస్త ఆలస్యమైనా, అందులోని ప్రతి సీన్.. తనను కదలించిందని, అందులోని ఎమోషన్స్.. తన మనసును బరువెక్కించాయని కామెంట్ చేసింది. మొత్తానికి, ఒక మంచి సినిమాతో 2024 ఏడాదికి వీడ్కోలు చెబుతున్నానని పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జాన్వీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.