Puri Jagannath-Vijay Sethupathi: కొంచెం లేట్ అయినా.. మహారాజానే పట్టాడు.. ఈసారి హిట్ పక్కా

Puri Jagannath-Vijay Sethupathi: ఇండస్ట్రీలో ఎవరైనా పూరి జగన్నాథ్ పని అయిపోయింది అని అనుకున్నప్పుడల్లా.. అంతలేదమ్మా అని పక్కా హిట్ తో నిరూపిస్తూ ఉంటాడు డైరెక్టర్ పూరి. సినిమాల కోసం చదువుకున్న డిగ్రీలనే తగలబెట్టిసినవాడు.. సినిమా కాకుండా ఇంకేది చేయడు. పూరి సినిమాలన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. లేదా.. మొత్తానికే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇండస్ట్రీలో నిలిచిపోయే సినిమాలన్నీ కూడా పూరి కేవలం గోవాలో రెండు నెలలో రాసిన కథలే.
ఇక పూరి పని అయిపోయింది అన్న టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అనుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా రామ్ ను ఇస్మార్ట్ శంకర్ గా చూపించి షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విజయంతో పూరికి మళ్లీ ఎదురే లేదు అనుకున్నారు. దీని తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమా చేశాడు.
లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పొచ్చు. పూరి కెరీర్ లో డిజాస్టర్ లకు లోటు లేదు. కానీ విజయ్ కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా లైగర్ నిలిచింది. సినిమాతో పోకుండా వివాదాలతో మరింత రచ్చ అయ్యింది. సరే, దీని తరువాత డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరికి మరో దెబ్బ పడింది.
ఇక ఇలా కాదు అనుకోని పూరి ఈసారి మంచి కథతో రావడానికి ఫిక్స్ అయ్యాడు. గత కొన్నిరోజులుగా పూరి ఒక మంచి స్టార్ హీరో కోసం వెతుకుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ స్టార్ హీరో విజయ్ సేతుపతి అని తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే. విజయ్ సేతుపతి హీరోగా పూరి దర్శకత్వంలో ఒకసినిమా తెరకెక్కనుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ నచ్చితే.. పాత్ర ఎలాంటిది. హీరోనా.. ? విలనా.. ? పాజిటివ్ నా.. నెగిటివ్ నా.. ? ఇలాంటివేమీ చూడడు. అలాంటి హీరోను పూరి ఒప్పించాడు అంటే కథలో మంచి పట్టు ఉందనే చెప్పాలి.
ఇక మహారాజా సినిమా తరువాత విజయ్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా పూరి కథ నచ్చడంతో వెంటనే సెట్స్ మీదకు వెళ్ళిపోదామని డేట్స్ కూడా అడ్జస్ట్ కూడా చేసాడట. కొన్నిరోజుల్లో ఈ సినిమాను పూరి అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు. విజయ్ సేతుపతి సినిమా అంటే హిట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.