Published On:

Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం.. మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి

Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం.. మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి

Attack On Lady SI: ఖమ్మం జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. దీంతో ఎస్ఐపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము, అతని అనుచరులు కల్లూరులోని తిరువూర్ క్రాస్ వద్ద ఉన్న ఓ హోటల్ కు వచ్చారు. అయితే టిఫిన్ చేసే విషయంలో హోటల్ నిర్వాహకులతో రాము వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది.

 

దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత.. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువర్గాలను ఆపాలని ప్రయత్నించారు. కానీ వారు ఆమె మాటలు లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాము ఎస్ఐపై దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాయల రాము సహా.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు.