Published On:

Vishnupriya: అయ్యగారిపై మనసు పారేసుకున్న హాట్ బ్యూటీ.. దానికి కూడా సిద్దమే అంటూ..

Vishnupriya: అయ్యగారిపై మనసు పారేసుకున్న హాట్ బ్యూటీ.. దానికి కూడా సిద్దమే అంటూ..

Vishnupriya: అందాల హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పోవే పోరా  అనే షో ద్వారా పరిచయమైన విష్ణుప్రియ.. వరుస అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా వెళ్ళింది. అక్కడ ఆమె గేమ్ తో కాకపోయినా పృథ్వీశెట్టితో ప్రేమాయణం నడిపి మరింత ఫేమస్ అయ్యింది.

 

బిగ్ బాస్ తరువాత విష్ణుప్రియ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మద్యమద్యలో టీవీ షోస్ లలో మెరుస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెల్సిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు ఆమెపై కేసు కూడా బుక్ అయ్యింది. విచారణకు కూడా హాజరైన విష్ణు.. తాను తెలియక చేశాను అని అభిమానులను క్షమాపణలు కూడా కోరింది.

 

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణు.. తన ఫేవరేట్ హీరో గురించి, అతనిపై  ఉన్న ఇంట్రెస్ట్ గురించి బయటపెట్టింది. అక్కినేని నటవారసుడు.. అఖిల్ అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే నటీనటులకు సపరేట్ గా ఒక అభిమాన హీరో ఉండడం, వారితో నటించాలని ఉండడం సహజమే. అయితే విష్ణుకు ఆ కోరిక మరింత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

 

” నాకు అఖిల్ అంటే చాలా ఇష్టం. అతనితో కలిసి నటించాలని నేను ఎప్పటినుంచో కలలు కంటున్నాను. అఖిల్ తోడ్యాన్స్  చేసే అవకాశం వచ్చినా చాలు. రెమ్యూనరేషన్ కూడా  వద్దు. ఐటెంసాంగ్ అయినా పర్లేదు. అఖిల్ పక్కన నటిస్తే చాలు. అఖిల్ అంటే ఎందుకు అంత పిచ్చి అంటే.. తెలియదు. పూర్వ జన్మలో నేను ఆయన భక్తురాలిని అయ్యి ఉంటాను. అందుకే ఈ జన్మలో అది కంటిన్యూ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ భక్తురాలి కోరిక అయ్యగారు తీరుస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.