Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎన్ని కోట్లు నష్టం అంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి.
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఊహించని రీతిలో ఈ సినిమా పరాజయం మూట గట్టుకుంది. పొందింది. మెగా అభిమానులని కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది.
అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ కోకాపేటలోని ఓ ఖాళీ స్థలంలో 20 ఎకరాల్లో ప్రత్యేకమైన సెట్ వేశారు. ధర్మస్థలి ఆలయం, గాలి గోపురం, దాని చుట్టూ ఓ గ్రామంలా భారీ సెట్ ని వేశారు. ఈ సెట్ మొత్తానికి దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు అయినట్టు అప్పట్లోనే తెలిపారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఈ సెట్ ని అద్భుతంగా వేశారు. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ సెట్స్ ని తీయలేదు. ఆ స్థలం ప్రస్తుతానికి ఖాళీగానే ఉండటంతో సెట్ బాగుంది కదా అని తీయకుండా అలాగే ఉంచారు. తాజాగా ఈ ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఆచార్య సెట్ లో అగ్ని ప్రమాదం (Megastar Chiranjeevi)..
సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ ఆలోపే ధర్మస్థలి టెంపుల్, ఆ చుట్టు పక్కల చాలా వరకు మంటల్లో కాలిపోయింది. దీంతో కోట్ల విలువైన సెట్ క్షణాల్లో బుగ్గిపాలైపోయింది. అయితే ఈ అగ్నిప్రమాదం ఓ వ్యక్తి సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో మంటలు అంటుకొని అవి అంతటా వ్యాపించి ఇలా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం అందుతుంది. దీనిపై ప్రస్తుతానికి ఆచార్య టీం ఎవరూ స్పందించలేదు.
కాగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించారు. మరి దీనిపై రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, కొరటాల శివ కానీ స్పందిస్తారేమో చూడాలి. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఎంత నష్టం జరిగిందో ఇంకా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/