Siddu Jonnalagadda – Vishwak Sen Combo: కుర్ర హీరోల మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేసిన దత్ సిస్టర్స్..?

Siddu Jonnalagadda – Vishwak Sen Combo: టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం వరకు ఇద్దరు, ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించేవారు. ఇక ఇప్పుడు హీరోలు పాన్ ఇండియా క్రేజ్ లో ఉన్నారు. ఏ సినిమా తీసినా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హీరోలతో పాటే ప్రొడక్షన్ హౌసెస్ కూడా తమ సంస్థలను అన్ని భాషల్లో విస్తరింపచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ఇద్దరు కుర్ర హీరోలతో కలిసి ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతీ మూవీస్.. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అశ్వినీ దత్ నిర్మించిన ఈ బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలు ప్రేక్షకులకు అలరించాయి. ఇక ఇప్పుడు ఈ సంస్థ బాధ్యతలను వారసురాళ్లు అయినా స్వప్న దత్, ప్రియాంక దత్ చూసుకుంటున్నారు.
ఇంకోపక్క ఈ బ్యానర్ కు తోడుగా స్వప్న సినిమాస్ అని ఇంకొకటి స్థాపించారు. అందులో చిన్న చిన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు సిస్టర్స్ కన్ను.. టాలీవుడ్ కుర్ర హీరోలు అయినా సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లపై పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. డీజే టిల్లు సినిమాతో సిద్దు స్టార్ హీరోగా మారాడు. ఈమధ్యనే జాక్ తో వచ్చి పరాజయం పాలయ్యాడు. ఇక వరుస ప్లాపుల మధ్యలో విశ్వక్ నడుస్తున్నాడు. సినిమాలు ప్లాప్ అయినా ఫ్యాన్స్ లో వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక వీరిద్దరితో ఒక మల్టీస్టారర్ తీస్తే బావుంటుందని దత్ సిస్టర్స్ అనుకుంటున్నారట. అందుకు తగ్గ కథను కూడా వారు వెతికి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాకుండా ఇద్దరి ఇమేజ్ లాన్ దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశారని టాక్. ఇక ఈ సినిమాకు పాత దర్శకులు కంటే కొత్త దర్శకుడు అయితే బెటర్ అని చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు దత్ సిస్టర్స్ వెల్లడించనున్నారట. అయితే ఈ మల్టీస్టారర్ కు ఈ కుర్ర హీరోలు ఒప్పుకుంటారా..? లేదా..? అనేది చూడాలి.