Vishwak Sen’s Cult Movie: మరోసారి డైరెక్టర్ గామారిన విశ్వక్.. ‘కల్ట్’ షూటింగ్ స్టార్ట్!

Vishwak Sen’s Cult Movie Shoot begins: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా అందరికీ సుపరిచితమే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫలక్ నామా దాస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత హీరోగా బిజీగా మారిన విశ్వక్.. ధమ్కీ అంటూ మరోసారి తన డైరెక్టర్ స్కిల్స్ ను బయటపెట్టాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఎప్పటి నుంచి విశ్వక్ స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ విశ్వక్ తన తదుపరి సినిమాను ప్రకటించాడు. విశ్వక్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కల్ట్. ఈ సినిమాకు మరో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమాను తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సరసన గాయత్రీ భరద్వాజ్ నటిస్తోంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ వేడుక రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
అల్లు అరవింద్.తో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ సినిమాకు రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ తెలిపారు. కల్ట్ సినిమాలో విశ్వక్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విశ్వక్.. ఒక మేక మాస్క్ పెట్టుకొని కనిపించాడు.
యువతకు ఈ కథ బాగా నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కల్ట్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషలతో పాటు స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.