Last Updated:

Dil Raju: తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా.. దిల్ రాజు వార్నింగ్

తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.

Dil Raju: తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా.. దిల్ రాజు వార్నింగ్

 Dil Raju: తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.

చిరంజీవి మాటలను వక్రీకరించారు..( Dil Raju)

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం,వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, తేజ సజ్జా నటించిన హనుమాన్ ఉన్నాయి. వీటిలో గుంటూరు కారం సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హనుమాన్ ని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు ఎక్కువ ధియేటర్లు ఉండేలా చేసిన దిల్ రాజు హనుమాన్ సినిమాను వాయిదా వేసుకోమని కోరాడని అయితే వారు నిరాకరించి ఈ నెల 12న మహేష్ బాబు సినిమాతో పాటు రిలీజ్ చేయాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి. దీనితో ఆ సినిమాకు ఎక్కువగా ధియేటర్లు రాకుండా దిల్ రాజు చేసాడని కొన్ని సైట్లలో వార్తలు వచ్చాయి. దీనిపై దిల్ రాజ్ తీవ్రంగా స్పందించారు. గత ఏడేళ్లుగా సంక్రాంతి సమయంలో తనపై కావాలనే నెగటివ్ ప్రచారం జరుగుతోందన్నారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాటలను కూడా వక్రీకరించి రెండు సైట్లు తప్పుగా రాసాయన్నారు. వాస్తవానికి చిరంజీవి దిల్ రాజుకు చిన్న సినిమాల సమస్యలు తెలుసు అంటే మరోలా అర్దం వచ్చేలా రాసాయని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగు పెట్టి సంక్రాంతి రేసు నుంచి తప్పుకోమని రవితేజను కోరగా అంగీకరించారని చెప్పారు. మరోవైపు నాగార్జున, వెంకటేష్ సినిమాలకు కూడా ధియేటర్లు లేవని వారేమైనా చిన్న హీరోలా అంటూ దిల్ రాజు ప్రశ్నించారు. వ్యూస్ కోసం ఇస్టానుసారంగా రాస్తే ఇకపై తాను సహించబోనని తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతికి తమిళ డబ్బింగ్ సినిమాను విడుదల చేస్తానంటూ కూడా వార్తలు రాసారని నిజానికి తాను అటువంటిది ఏమీ చేయడం లేదని దిల్ రాజు స్పష్టం చేసారు.