Dil Raju: తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్స్ పెరుగుతాయా? – దిల్ రాజు రియాక్షన్ ఇదే!
Game Changer Ticket Rates: నిర్మాత, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంతో తెలంగాణ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ కలుస్తానని చెప్పారు. తాజాగా దిల్ రాజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ మూవీకి తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నం చేస్తానన్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలుస్తానని చెప్పారు. ఈ అంశంపై ఆయన సానుకులంగా స్పందిస్తారని ఆశిస్తున్నానన్నారు. చిత్ర పరిశ్రమ అభివ్రద్దికి సీఎం కూడా చాలా ముందు చూపుతో ఉన్నారు. కాబట్టి నిర్మాత టికెట్ రేట్ల పెంపుపై తన వంతు ప్రయత్నం చేస్తానని దిల్ రాజు అన్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఇండస్ట్రీకి సపోర్టు చేశాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటానని అన్నారు. అదే ఆశతోనే మళ్లీ ఆయనను కలుస్తా. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ను ంచి భారీ స్థాయిలో చిత్రాలు రూపొందుతున్నాయి. అందుకోసం బడ్జెట్ కూడా కాస్తా ఎక్కువగానే ఉంటుంది. టికెట్ రేటట్స్ పెంచడం వల్ల 18 శాతం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా అందుతుంది” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ ధరల పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే మొదటి రోజు 4 గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ. 175 సింగిల్ థియేటర్స్‌లలో, రూ. 135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. రెండోవ రోజు (11వ తేదీ) నుంచి 23వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. పెంచిన ధరలు జనవరి 23 వరకు ఉంటాయని స్పష్టం చేసింది.