Baapu Movie: రెండు వారాల్లోనే ఓటీటీకి వస్తున్న బ్రహ్మాజీ ‘బాపు’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Bapu Movie Locks OTT Release Date: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బాపు'(Baapu Movie) ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. రిలీజ్‌కు ముందు రానా దగ్గుబాటి. రష్మిక మందన్నా, కల్కి మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్, విశ్వక్ సేన్ వంటి స్టార్స్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్ని బాపును ప్రమోట్ చేశారు. దీంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా విడుదలై వారం రోజులే అవుతోంది. అప్పుడే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. మార్చి 7వ తేదీ నుంచి బాపు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కి రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ మేరకు బాపు మార్చి 7 నుంచి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు నేడు అధికారిక ప్రకటన ఇచ్చింది.
థియేటర్లలో విడుదలైన 14 రోజులే మూవీ ఓటీటీకి రావడంతో అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బ్రహ్మాజీ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండ నటించానని చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పానని, ప్రస్తుత సమాజంలో ఇటువంటి సినిమాల అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే ఈ చిత్రం కోసం తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదన్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, నటుడు-దర్శకుడ అవసరాల శ్రీనివాస్, నటి ధన్య బాలకృష్ణలు ప్రధాన పాత్రలు పోషించారు. దయా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాసు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డిలు నిర్మించారు.