Last Updated:

Chiranjeevi: రామ్‌ చరణ్‌ సినిమాలో చిరంజీవి అతిథి పాత్ర – నిజమెంతంటే!

Chiranjeevi: రామ్‌ చరణ్‌ సినిమాలో చిరంజీవి అతిథి పాత్ర – నిజమెంతంటే!

Chiranjeevi Cameo in Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌సీ16(RC16) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి పెద్ది అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. క్రియేట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడిగా ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. తొలి చిత్రంతోనే వందకోట్ల గ్రాస్‌ చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించారు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మరింత హైప్‌ పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది తెలిసి మెగా అభిమానులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇంతక అదేంటంటే. RC16లో మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డైరెక్టర్‌ బుచ్చిబాబు చిరుతో ఓ గెస్ట్‌ రోల్‌ ప్లాన్‌ చేస్తున్నాడంటూ తెగ ప్రచారం జరుగుతోంది.

తండ్రి కొడుకుల మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారని తెలిసి మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. నిజానికి చిరు, చరణ్‌లు కలిసి తెరపై కనిపిస్తే అది అభిమానులకు చాలా ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు. ఆచార్య వీరిద్దరు కలిసి నటించారు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించకపోయిన, ఫ్యాన్స్‌కి మాత్రం ఇది చాలా ప్రత్యేకమనే చెప్పాలి. మరోసారి RC16లో చిరు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారంటూ వస్తున్న అప్‌డేట్‌ చూసి మెగా అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని సినీవర్గాల నుంచి సమాచారం.

ఇది కేవలం పుకారను మాత్రమేనని, ఈ సినిమాలో బుచ్చిబాబు ఎలాంటి అతిథి పాత్రలు ప్లాన్‌ చేయలేదని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ నటుడు, మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ ఫేం దివ్వేందు శర్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది సెట్‌లో ఉండగానే ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల, అనిల్‌ రావిపూడితో సినిమాలను లైన్‌లో పెట్టాడు.