Esha Gupta Dating with Hardik: హార్దిక్ పాండ్యతో ఈషా గుప్తా డేటింగ్.. స్పందించిన నటి..!

Hardik Pandya dating With Esha Gupta: భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే పాండ్యాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి ఈషా గుప్తా స్పందించారు. ఆయనతో కొంతకాలం మాట్లాడినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించిందని, కానీ డేటింగ్ వెళ్లే సమయంలోనే కథకు ఎండింగ్ పడినట్లు చెప్పుకొచ్చారు.
‘క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొన్ని నెలలపాటు నేను మాట్లాడానని, ఇద్దరం చాలా సేపు కబుర్లు షేర్ చేసుకునేవాళ్లం. వ్యక్తిగతంగా నేను, హార్దిక్ మీట్ అయ్యాం. వీటిని డేటింగ్ అనలేం. కానీ డేటింగ్ కోసం అడుగు వేద్దామనే తరుణంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో మా బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాం. మా ఇద్దరి మధ్య బంధం తెగిపోవడంతో ప్రస్తుతం అతడితో కాంటాక్ట్ లో లేను.’ అని ఇషా గుప్తా చెప్పుకొచ్చింది.
కాగా, ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళల విషయంపై హార్దిక్ చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచి హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంపై ఆమె స్పందిచారు. ఆయన చేసిన విమర్శలపై నేను ఇబ్బంది పడలేదన్నారు. ఎందుకంటే అతడు విమర్శలు చేసే సమయానికి మేము రిలేషన్ లో లేమని, ఇద్దరం విడిపోయామని వెల్లడించారు.