Pushpa song copied: మనమే కాదు, హాలీవుడ్ కూడా మన పాటను కాపీ కొట్టింది.!

Pushpa song copied by bollywood: పుష్ప ఈ పేరు చెబితే చాలు విజయాలు, కాంట్రవర్సీలు, ఉలిక్కిపడడాలు, పోలీసులు, జైల్లు ఎన్నో గుర్తుకొస్తాయి. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కానీ, హీరో అల్లు అర్జున్ కానీ పైవన్నీ ఊహించి ఉండడు. అయితే తాజాగా ఈ సినిమాలోని ట్యూన్ ను హాలీవుడ్ సింగర్ కాపీ కొట్టిందని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పుష్ప 1 లో సమంతతో తీసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా సాంగ్ ట్యూన్ కాపీ చేశారు. ఈ విషయాన్ని ఓ సినీ ఫంక్షన్ లో వేదికపై చెప్పాడు దేవీ. అయితే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచం మొత్తం తన పాటను ఆదరించిందని అన్నాడు దేవి. తన స్టూడియోలో కేవలం 5నిమిషాల్లో పాట ట్యూన్ ను తయారు చేసినట్లు గుర్తుకుచేసుకున్నాడు. ఇందులో సమంత మాస్ అప్పీల్ ఇచ్చింది. సినిమా మొత్తానికి ఒక ఊపుఊపిన పాట అంటే ఇప్పటికీ ఊ అంటావా మావా ఊఊ అంటావా అనే చెబుతారు. అయితే ఒక తెలుగు పాటను హాలీవుడ్ కాపీ కొట్టడం మొదటిసారని దేవీ అంటున్నాడు. తాను కేసు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలిపాడు.

pushpa song copied by bollywood
టర్కిష్ కు చెందిన అతియో అనే మహిళ చేసిన స్పెషల్ సాంగ్ లో ఈ ట్యూన్ ను వాడింది. ఆ పాటను యూ ట్యూబ్ లో చూడాలంటే ‘Anlayana’ అని టైప్ చేయాలి. ఇది 2024లో రిలీజ్ అయింది. టర్కిష్, ఇంగ్లీష్ బాషల్లో రిలీజ్ అయింది. అయితే భారతీయ ఫ్యాన్స్ మాత్రం సదరు గాయకురాలిని ప్రశ్నిస్తున్నారు. ఈ పాట దేవీశ్రీదని ఎందుకు కాపీ కొట్టావని అంటున్నారు.