Last Updated:

Ott Movies: ఈ వారం ఓటీటీ చిత్రాలు.. ప్రత్యేకంగా మీకోసం

Ott Movies: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Ott Movies: ఈ వారం ఓటీటీ చిత్రాలు.. ప్రత్యేకంగా మీకోసం

Ott Movies: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారంతంలో వినోదాలను పంచడానికి సిద్దమైన సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం.

ఈ వారం సినిమాలు.. (Ott Movies)

ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారంతంలో వినోదాలను పంచడానికి సిద్దమైన సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం.

విరూపాక్ష..

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా థియోటర్లలో ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇపుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మే 21వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

‘ఏజెంట్‌’

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ నటించిన తాజా చిత్రం ఏజెంట్‌. భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు.

నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్..

మెగా వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిహారిక. ఒకట్రెండు సినిమాల తర్వాత వెండితెరకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. నిహారిక కీలక పాత్రలో నటించిన తాజా సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

అయాలవాషి (మలయాళం)మే 19
కథల్‌ : ఏ జాక్‌ఫ్రూట్‌ మిస్టరీ (హిందీ) మే 19

బయీ అజైబి (ఇంగ్లీష్‌) మే 19
సెల్లింగ్‌ సన్‌సెట్‌ (సీజన్‌-6) మే 19
మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌) మే 19

సోనీ లివ్‌

కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

బ్యాక్‌డోర్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది

మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌) మే 18
ఆహా

మారుతీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ (తమిళ్‌)) మే19
ఏమి సేతురా లింగ (తెలుగు) మే 19
తెలుగు ఇండియన్‌ ఐడల్‌ (ఎపిసోడ్‌ 24, 25) మే 19, 20
సర్కార్‌ 3 (ఎపిసోడ్‌ 4, 5) మే 19, 20