Last Updated:

Pushpa 2 Collection: బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ ప్రభంజనం – 21 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే

Pushpa 2 Collection: బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ ప్రభంజనం – 21 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే

Pushpa 2 Movie 21 days Collections: అల్లు అర్జున్‌ పుష్ప 2 విడుదలకు ముందు నుంచే రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తుంది. ముఖ్యంగా కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు సునామీ వసూళ్లు చేస్తుంది. ఆల్‌టైం రికార్డు వసూళ్లతో వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఏకంగా బాలీవుడ్‌లో చరిత్ర తిరగరాసింది. ఇప్పటికి 600లకు పైగా కోట్ల గ్రాస్ చేసిన తొలి ఫాస్టెస్ట్‌ సినిమాగా హిందీలో పుష్ప రికార్డు క్రియేట్‌ చేసింది.

అది కూడా డబ్బింగ్‌ సినిమా కావడం విశేషం. ఇక వరల్డ్ బాక్సాఫీసు వద్ద అయితే ఇప్పటికే కేజీయఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల ఆల్‌టైం రికార్డ్‌ని కేవలం 11 రోజుల్లోనే బీట్‌ చేసింది. ప్రస్తుతం బాహుబలి 2, దంగల్‌ చిత్రాలనే బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో పుష్ప 2 మూవీ 21 డేస్‌ కలెక్షన్స్‌పై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1705 కోట్ల గ్రాస్‌ చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఇక 2024లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా కూడా పుష్ప 2 ఘనత సాధించింది. ఇక తొలి రోజు రూ. 294 కోట్ల కలెక్షన్స్‌తో పుష్ప 2 బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది.