Actress Bhavana Divorce: విడాకుల వార్తలపై స్పందించిన నటి భావన..

Actress Bhavana on Divorce Rumours: మలయాళ నటి భావన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె తెలుగు మహాత్మ, ఒంటరి చిత్రాలతో మంచి గుర్తింపుపొందింది. చేసింది రెండు సినిమాలే అయిన తన అందం, అభినయం తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అంతేకాదు తమిళ్, కన్నడలోనూ పలు సినిమాలు చేసిన ఆమె సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
నిర్మాతతో పెళ్లి
ఆ తర్వాత 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేష్ పెళ్లాడింది. లాంగ్ గ్యాప్ తర్వాత గతేడాది నడికర్, హంటర్ చిత్రాలతో పలకరించింది. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా ఆమె తన పర్సనల్ విషయాలతో సోషల్ మీడియలో నిలుస్తోంది. ఆమె తన భర్తతో విడిపోతుందని, వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా భావన తన విడాకులు వార్తలపై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె విడాకుల వార్తలపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది.
తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచాలనుకుంటానని, అందుకే తన పర్సనల్ లైఫ్ గురించి లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారంది. “నేను నా పర్సనల్ లైఫ్‌ని చాలా గొప్యంగా ఉంచాలనుకుంట. అందుకే నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. నాకు అది ఇష్టం లేదు కూడా. దానినే అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం విడిపోతున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం.
అందుకే విడాకుల వార్తలు వచ్చాయి
అనుకోకుండ ఫోటోలు షేర్ చేసిన కూడా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. అలా మా బంధాన్ని నిరూపించుకోవడానికి నా భర్త ఫోటోలు షేర్ చేయాల్సిన అవసరం లేదు కదా!” అని చెప్పుకొచ్చింది. ఇలా విడాకులపై వస్తున్న రూమర్లకు భావన ఇలా చెక్ పెట్టింది. మలయాళ చిత్రం ‘నమ్మల్'(2002) చిత్రంతో భావన సినీకెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చితిరం పెసుతడితో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరో అజిత్ సరసన కూడా నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఒంటరి సినిమాతో తెలుగులో అడుపెట్టిన భావన శ్రీకాంత్ సరసన మహాత్మ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందింది.